ఆ టైటిల్ పెట్టి అలా చేసి ఉంటే ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ అయ్యేదా.. ఏమైందంటే?
TeluguStop.com
ఆదిపురుష్( Adipurush ) సినిమా వివాదాలతో మొదలై రిలీజ్ తర్వాత కూడా వివాదాలతో కొనసాగుతుండటం గమనార్హం.
ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆ ఆశలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆదిపురుష్ అనే టైటిల్ విషయంలోనే తప్పు జరిగిందని కొంతమంది చెబుతున్నారు.శ్రీరాముడి పేరు ఆదిపురుష్ అని ఎక్కడా ప్రస్తావించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాకు జై శ్రీరామ్ పర్ఫెక్ట్ టైటిల్ అని ఆ టైటిల్ ను ఫిక్స్ చేసి ఉంటే ఈ సినిమాకు మేలు జరిగి ఉండేదని కొంతమంది చెబుతున్నారు.
మరోవైపు ఓం రౌత్ ఆదిపురుష్ ను తన ఊహలకు అనుగుణంగా కాకుండా, ఎవరి మనోభావాలను కించపరచకుండా టెక్నాలజీని( Technology ) ఉపయోగించి ఇంతే అద్భుతంగా తెరకెక్కించి ఉంటే ఆదిపురుష్ సినిమాతో ఓం రౌత్ ఇండస్ట్రీ హిట్ సాధించేవారని చెప్పవచ్చు.
"""/" /
అలా చేసి ఉంటే ఆదిపురుష్ మూవీ ఈ స్థాయిలో వివాదాల్లో సైతం చిక్కుకుని ఉండేది కాదు.
మేకర్స్ ఈ సినిమా విషయంలో ఇంత పెద్ద పొరపాట్లు ఏ విధంగా చేశారో అర్థం కావడం లేదు.
ప్రభాస్( Prabhas ) అయినా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మెరుగ్గా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిపురుష్ సినిమాపై వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. """/" /
ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వ్యక్తమవుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ స్పందిస్తే ఈ సినిమాపై నెగిటివిటీ కొంతమేర తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మైథలాజికల్ సినిమాలను తెరకెక్కించే వాళ్లను ఆదిపురుష్ మూవీ భయపెట్టిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ప్రభాస్ సైతం ఇలాంటి ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.
అమెరికాలో హై-టెక్ మోసం.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..