రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District)ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని,గ్రామాల్లో విజబుల్ పోలీసింగ్, నేరాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ కార్యాలయం,ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ కార్యాలయం తనిఖీ చేసి సర్కిల్ పరిదిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు,అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసులలో సిడి ఫైల్స్, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించి,కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు.సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయాఎస్సై ల ద్వారా చర్యలు చేపట్టాలని, సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని సూచించారు.
అనంతరం ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్( Yellareddipet Police Station ) తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ ,వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ….ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని,పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని,విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ప్రజలతో సస్సబంధాలు కలిగి ఉండాలని, గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం విపివో ల దగ్గర ఉండాలని ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలన్నారు.
బ్లూ కోల్ట్( Blue Colt ) సిబ్బంది డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలని, రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై ,అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ కట్టడి చేయాలన్నారు.సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.
ఎస్పీ గారి వెంట సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్,ట్రెని ఎస్.ఐ రాహుల్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.