రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కోనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల:రైతులు నాణ్యమైన, ఆరబెట్టిన వరి ధాన్యాన్ని వరి కోనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) అన్నారు.బుదవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం, అవునూరు, ఎల్లారెడ్డిపేట మండలం పదిర, వెంకటాపూర్ గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రారంభించారు.

 Additional Collector Khimya Naik Said Farmers Should Bring Quality Grain To Proc-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ రైతులు( Farmers ) పండించిన పంటను కోనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా వ్యాప్తంగా 258 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు.

రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ (FAQ) నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, 17 శాతం కన్న తక్కువ తేమ ఉండేలా చూసుకోవాలని తాలు, రాళ్ళు, మట్టి గుల్లలు లేకుండా చూసుకోవాలని తెలిపారు.

ఏ.గ్రేడ్ ధాన్యానికి రూపాయలు2320/- కామన్ గ్రేడ్ ధాన్యానికి రూపాయలు 2300/- రూపాయలు ధర ప్రభుత్వం నిర్ణయించిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.

రైతులు ధాన్యాన్ని తీసుకు వచ్చేటప్పుడు వారి వెంట పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డు తప్పనిసరి తీసుకురావాలని అన్నారు.వరి ధాన్యం కొనుగోలు లో సెంటర్ నిర్వాహకులు ఎలాంటి అవకతవకలు పాల్పడిన వారి పై తగు కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ.శేషాద్రి, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి రామకృష్ణ , సివిల్ సప్లై అధికారి వసంత లక్ష్మి, రజిత, తాసిల్దార్ సురేష్ , స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు , సెంటర్ నిర్వాహకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube