రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకులు డా, జి.సత్యనారాయణ స్వామిని ప్రభుత్వం ఉత్తమ వైద్యునిగా గుర్తించి ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా మెమొంటోను అందజేశారు ,
డాక్టర్ జి.
సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ.సుమారు 40 సంవత్సరాలుగా ఎల్లారెడ్డిపేటలో అశ్విని హాస్పిటల్ నిర్మించి ఎంతో మంది ప్రాణాలు కాపాడి నిరుపేదలకు అండగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఉత్తమ వైద్యునిగా ప్రభుత్వం గుర్తించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.