సాధారణంగా కొందరికి ముఖం ఒక రంగులో ఉంటే.మెడ మరొక రంగులో ఉంటుంది.
ముఖ్యంగా ఒకానొక సమయంలో మెడ చాలా నల్లగా( Dark Neck ) మారిపోతుంటుంది.హార్మోన్ చేంజ్, ఒంట్లో వేడి ఎక్కువవడం, ఎండల ప్రభావం, మృత కణాలు పేరుకుపోవడం తదితర అంశాలు డార్క్ నెక్ కి కారణం అవుతుంటాయి.
రీజన్ ఏదైనా సరే మెడ నల్లగా వేరుపాటుగా కనిపిస్తే ఆడవారు అస్సలు సహించలేరు.ఈ క్రమంలోనే మెడను మళ్ళీ మునుపటిలా మెరిపించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఎంతో బాగా సహాయపడుతుంది.ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతినిత్యం ఎంతో కొంత రైస్ మిగిలిపోతూ ఉంటుంది.మిగిలిపోయిన రైస్ ను( Leftover Rice ) కొందరు నెక్స్ట్ డే తింటూ ఉంటారు.మరి కొందరు డస్ట్ బిన్ లోకి తోసేస్తూ ఉంటారు.
అయితే ఆ మిగిలిపోయిన రైస్ తో మీరు మీ మెడను తెల్లగా అందంగా మెరిపించుకోవచ్చు.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మిగిలిపోయిన రైస్ ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ శెనగపిండి, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు పావు కప్పు ఫ్రెష్ పొటాటో జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో మెడను సున్నితంగా రబ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.ఈ రెమెడీ మెడ నలుపును క్రమ క్రమంగా వదిలిస్తుంది.
డార్క్ నెక్ ను వైట్ గా బ్రైట్ గా మారుస్తుంది.చర్మంపై పెరిగిపోయిన మురికి మృతకణాలను తొలగిస్తుంది.
కాబట్టి డార్క్ నెక్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.