రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ వంగ రామేశ్వర్ రెడ్డి జయంతి సందర్భంగా తన కుమారుడు గిరిధర్ రెడ్డి మండల కేంద్రంలో ఎంపీపీఎస్ కిషన్ దాస్ పేట పాఠశాలలలో విద్యార్థిని విద్యార్థులకు జావా త్రాగడానికి గ్లాసులను బహుకరించారు.
అలాగే మండల కేంద్రంలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకట నరసింహారెడ్డి , సురేందర్ రెడ్డి , అమరేందర్ రెడ్డి , సత్తిరెడ్డి , లక్ష్మారెడ్డి లు తదితరులు పాల్గొన్నారు.