రాజన్న సిరిసిల్ల : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ,బండ లింగంపల్లిలో గొల్లపల్లిలో ఇద్దరి చొప్పున,బోప్పాపూర్ లో ఒక్కరికి మొత్తం 3 లక్షల 50 వేల రూపాయల సిఎం రీలిఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు ఆయా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులతో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పార్టీలకు అతీతంగా దరఖాస్తు చేసుకోవచ్చునని పేద ప్రజలందరికీ ఈ పథకం ద్వారా సహాయ మందిస్తామన్నారు.ఈ నెల చివర వరకు ఇండ్లు మంజూరు చేసి అధికారులు వచ్చి ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసి ప్రారంభిస్తారన్నారు.15 ఆగస్టు వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారన్నారు.రైతులకు ఎవరికైనా రుణమాఫీ బ్యాంకు అదికారుల పొరపాటు వలనగాని వ్యవసాయశాఖ అధికారుల పొరపాటు వలన కాకపోతే పరిశీలించి వారికి రుణమాఫీ జరిగేటట్లు ప్రయత్నం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో చేపూరి రాజేశం గుప్తా,మాజీ జెడ్ పిటీ సి సభ్యులు,ఏలూరి రాజయ్య , జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి ,జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ ,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహేబ్ , కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి , కొండాపురం శ్రీనివాసరెడ్డి పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు గుండాడి రాం రెడ్డి , వడ్నాల ఆంజనేయులు బండారి బాల్ రెడ్డి , సిరిపురం మహేందర్ దొమ్మాటి రాజు కొత్తపల్లి దేవయ్య , బాల్ రాజు రమేష్ గౌడ్ , ఇమామ్ బాయి , కిష్టారెడ్డి, పందిర్ల సుధాకర్ గౌడ్ ,గుడ్ల శ్రీ నివాస్ , ఏలూరు రాజయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.