రాజన్న సిరిసిల్ల జిల్లా :వాన పడితే గ్రామానికి బస్సు బండ్ గుంతలమయమైన రహదారి వర్షాకాలం దారంతా బురదమయం గతంలో కంకర పోశారు తారు లేదు అన్ని గ్రామాలకు తారు రోడ్డు వేయించారని తమ గ్రా మం ఏమి పాపం చేసిందని మా గ్రామానికి తారు రోడ్డుకు మోక్షం ఎప్పుడని చందుర్తి మండలం కిష్టంపేట ప్రజలు అంటున్నారు.వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం కిష్టంపేట గ్రామం ఒక మూలన ఉంటుంది.
ఆ గ్రామంలో దాదాపు 1242 ఓట్లు ఉన్నా యి.గ్రామస్తుల తెలిపిన వివరాలు ప్రకారం….చందర్తి మండలంలోని కిష్టంపేట గ్రామం వేములవాడ సను గుల ప్రధాన రహదారిలో కాకుండా పక్కకు ఉంటుంది.ఈ గ్రామానికి బస్సు ఊరు మధ్య నుండి నక్కపల్లి హై స్కూల్ ఏరియా మీదుగా రాంరావుపల్లి మీదుగా సను గుల వెళ్తుంది.
అయితే ఈ మార్గంలో దాదాపు 10 సంవత్సరాల క్రితం కిష్టంపేట ఊరులోకి వచ్చేటువంటి దారి నుండి గ్రామంలోని నాయకురాలు గుడి రాకముందు వరకు తారు రోడ్డు వేశారు.అక్కడి నుండి నక్కవ ల్లి, హైస్కూల్ ముందు నుంచి రాంరావుపల్లె చౌరస్తా వరకు మెటల్ రోడ్డు వేశారు చాలాకాలం అవడంతో కా స్త ఉన్న తారు రోడ్డు, మెటల్ రోడ్డు చెడిపోయి గుంతల మయంతో మరి దారుణంగా తయారైంది.
వర్షాలు పదడంతో రోడ్డు అంతా నడవలేక బురదమయంతో తయారవుతుంది.దీంతో గ్రామంలోకి వచ్చే బస్సు కాస్త లోపలికి రాకుండా గ్రామ పోచమ్మ గుడి, బస్టాండ్ నుం డి తిరిగి వెళ్ళిపోతుంది దీంతో నిత్యం చదువుల కోసం బస్సులో ప్రయాణించే విద్యార్థిని, విద్యార్థులు, ఇతర గ్రామాలకు వనిలో కోసం వెళ్లే గ్రామస్తులు తీవ్ర అవ స్థలు పడాల్సి వస్తుంది.
బస్సు లోపలికి రావాలని గుండ లను మట్టితో పూడుస్తున్నారు.ఇప్పటికైనా మా గ్రామం పై చిన్న చూపు చూడకుండా శాశ్వత పరిష్కారంగా కావలసిన తారురోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోని మా సమస్యకు మోక్షం కలగించాలని అధికారులను వేడుకుంటున్నారు.
చందుర్తి మండలం లోని వేముల వాడ- సనుగుల ప్రధాన రహదారి కిష్టంపేటకి బస్సు రాకుండా నేరుగా సనుగుల వెళుతుండగా ప్రజలకు, ప్రత్యేకంగా విద్యార్థులకు ఇబ్బందులు కలిగింది.ప్రలు లంతా వినతి మేరకు వయా కిష్టంపేట గ్రామానికి బస్సులు తెప్పించారు.
వర్షాల దృష్ట్యా బస్సు గ్రామానికి రాలేక విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లేందుకు అవస్థలకు గురవుతున్నారు.విద్య,వైద్యం ప్రభుత్వం ప్రత్యేకంగా వేశాదని, దాని దృష్ట్యా మారుమూల గ్రామమన కిష్టంపేట గ్రామానికి బస్సు వచ్చేందుకు వీలుగా తక్షణం తారు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు ముక్తకుంఠంగా కోరుతున్నారు