రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల పట్టణంలోని మానేరు వంతెన కింద ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యం.బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో అటుగా వెళ్లిన ఓ వ్యక్తి మృతదేహాన్ని చూసి సిరిసిల్ల పోలీసులకు సమాచారం అందించాడు.సంఘటన స్థలానికి డి.ఎస్.పి చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ సిఐ కృష్ణ, చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి మృతుడు నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు.
ఈ మృతదేహానికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే సిరిసిల్ల పోలీసులకు సమాచారం అందించాలని పట్టణ సిఐ కృష్ణ కోరారు.