నేరాల నియంత్రణకే "కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం" - వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఈ రోజున ఉదయం చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవునితండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి, గ్రామంలో సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్స్ లేని 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సబంధించిన వాహన దారులకు సరైన పత్రలు చూపించి వాహనాలు తీసుకవెల్లచని,గ్రామంలో అక్రమ గుడుంబా తయారీకి కోసం నిల్వ ఉంచిన సామగ్రిని మరియు అక్రమ కలప దుంగలను స్వాధీన పర్చుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

 Community Contact Program For Crime Control Vemulawada Asp Seshadrini Reddy, Com-TeluguStop.com

అనంతరం ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మట్లాడుతు ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.

పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసులకు,లేదా డయల్ 100 కాల్ కు చేసి సమాచారం అందించాలని వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.

గ్రామాల్లో యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయి,గుడుంబా తయారీకి సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలల్లో,నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి.ఐ వెంకటేస్వర్లు, ఎస్.ఐ ,శ్రీకాంత్, శేఖర్ రెడ్డి,అశోక్, పోలీస్ సిబ్బంది , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube