అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కి చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ జిల్లాలో ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు క్యాంపుల నిర్వహణ 2బి ఎచ్ కె లకు ఉన్న రహదారి సమస్య కు పరిష్కారం అర్హులైన వారికి త్వరలో 2బి ఎచ్ కె ఇండ్ల పంపిణీ 6,8,10వ తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించిన జిల్లా కలెక్టర్విద్యార్థులకు బోధిస్తున్న అంశాల పై ఆరా పాటశాలలోని వంటశాల, బోజన శాల సందర్శన ఇల్లంతకుంట రైతు వేదికలో నిర్వహించిన దివ్యాంగుల గుర్తింపు క్యాంపును, 2బి ఎచ్ కె ఇండ్లు , మండలంలో నీ వివిధ రోడ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు సహాయ పరికరాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇల్లంతకుంట రైతు వేదికలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల గుర్తింపు క్యాంపును మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి ఆచార్య జయశంకర్ జయంతి పురస్కరించుకొని రైతు వేదికలో ఆచార్య జయ శంకర్ చిత్రపటానికి వేసి నివాళులర్పించి,జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

 Measures For Distribution Of Appliances To Deserving Disabled Persons , Disabled-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, సహాయ పరికరాల గుర్తింపు కోసం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు ప్రతి రోజు ఒక చోట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు.

శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ చేతి కర్రలు, చంక కర్రలు, వీల్ చైర్లు ,మూడు చక్రాల సైకిల్, చెవిటి, మూగ దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, దృష్టిలోపం కల వారికి స్మార్ట్ కేన్ అందుల చేతి కర్ర అంద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, మానసిక దివ్యాంగులకు యం.ఎస్.ఐ.ఇ.డి కిట్ లేదా యం.ఆర్.కిట్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని అన్నారు.దివ్యాంగులు తమ వెంట సదరం వైద్య ధృవీకరణ పత్రం లేదా 40% వికలాంగత్వం మించినట్లు ఫిజీషియన్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, యూ.డి.ఐ.డి.కార్డు ధ్రువీకరణ పత్రం ఆహార భద్రత కార్డు ఆధార్ ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకొని రావాలని, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ పొందడానికి 100% వికలాంగత్వం, మిగిలిన ఉపకరణాలు పొందడానికి 40% వికలాంగత్వం ఉంటే సరిపోతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 3 సంవత్సరాల తర్వాత జిల్లా కలెక్టర్ చోరువతో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు సహాయ పరికరాలు అందించేందుకు దివ్యాంగుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.

దివ్యాంగుల గుర్తింపు కోసం ఏర్పాటుచేసిన క్యాంపులను వినియోగించుకొని దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాలు సహాయ పరికరాలు పొందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

అనంతరం రైతు వేదిక ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటీ మండల కేంద్రంలోని రెండు పడకల గదుల ఇండ్లను పరిశీలించినారు.

రెండు పడక గదుల ఇండ్లకు ఉన్నటువంటి రహదారి సమస్యను త్వరలో పరిష్కరించి, పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.పక్కనే గల కే.జీ.బీ.వీ విద్యాలయంను సందర్శించి 6,8,10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు , గణితం, బౌతిక శాస్త్రాలను బోధించారు.విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాల అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్ ల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, పరిశీలించి, వారి నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనము మెనూ ప్రకారం అందించాలని పేర్కోన్నారు.జాతీయస్థాయిలో షాట్ పుట్ పోటీలో పాల్గొన్న పదో తరగతి విద్యార్థులు అర్చిత,అంకిత లను సన్మానించారు.

కేజీబీవీ భవనం పై అంతస్తు లో అసంపూర్తిగా ఉన్నటువంటి డార్మటరీ నీ పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేశారు.ఇల్లంతకుంట నుండి వెంకట్రావుపల్లి మీదుగా సిద్దిపేట వెళ్లే రహదారి మరమ్మతులు చేపట్టడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, తోరగా మరమ్మతు చర్యలు చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డి.అర్.డి.ఓ.శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి బుద్ధ నాయుడు, ఎం.పి.డి.ఓ , తాసిల్దర్ , జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది , ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube