తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా( Narayanapeta ) కోస్గి మండలంలోని ఈజీపూర్ కు చెందిన మొగులమ్మ( Mogulamma ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.రాములమ్మ, నర్సింహులు దంపతుల రెండో సంతానం అయిన మొగులమ్మ ఏడేళ్ల వయస్సులో పోలియో( Polio ) సోకి రెండు కాళ్లు చచ్చుబడటంతో శాశ్వతంగా వికలాంగురాలు అయ్యారు.
పేదరికం, వైకల్యం వల్ల ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇంటర్ చదివే సమయంలో ఫీజులు, పుస్తకాల కొరకు ఆమె పదో తరగతి విద్యార్థులకు ట్యూషన్ చెప్పారు.
ట్రై సైకిల్ పై కోస్గి వెళ్లి మొగులమ్మ చదువుకున్నారు.ఆ తర్వాత మహిళా సంఘంలో బుక్ కీపర్ గా, ఆరోగ్య కార్యకర్తగా ఆమె పని చేశారు.
ఒక స్వచ్చంద సంస్థ కాళ్లు లేని మొగులమ్మకు శిక్షణ ఇవ్వగా ఆ సమయంలో మొగులమ్మ తనలాంటి వారిలో స్పూర్తి నింపాలని భావించారు.
మొగులమ్మ వైకల్యంతో బాధ పడేవాళ్లకు ఒకే తాటిపైకి తీసుకొచ్చి సంఘాలుగా ఏర్పాటు చేయించింది.వైకల్యంతో బాధ పడేవాళ్లకు అవసరమైన ఆపరేషన్లను చేయించడంతో పాటు ఆసరా పరికరాలను సమకూర్చి మొగులమ్మ మంచి మనస్సును చాటుకున్నారు.మొగులమ్మ సేవలకు 2003 సంవత్సరం నుంచి ఎన్నో అవార్డులు వచ్చాయి.
దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డ్, అమ్మ మాతాజీ అవార్డ్, శ్రీ శక్తి అవార్డ్, ఉత్తమ మహిళ అవార్డ్ ను ఆమె సొంతం చేసుకున్నారు.
కోస్గి మండలంలో( Kosgi Mandal ) 871 మంది దివ్యాంగులను ఆమె సంఘటితం చేశారు.దివ్యాంగ సంఘాలకు సెర్ఫ్, డీఆర్డీఏ మ్యాచింగ్ గ్రాంట్లు అందేలా ఆమె చేశారు.ఈ నిధుల ద్వారా మొగులమ్మ వైకల్యం ఉన్న పిల్లలకు ఫిజియోథెరపీ( Physiotherapy ) అందిస్తున్నారు.
మొగులమ్మ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని చెప్పవచ్చు.తనకు వీలైనంత మందికి శస్త్రచికిత్సలు చేయించడానికి మొగులమ్మ తన వంతు కష్టపడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.
వైకల్యం శరీరానికే కానీ సంకల్పానికి కాదని ఆమె ప్రూవ్ చేయడం గమనార్హం.