తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో ఒకరు ఎన్టీయార్( NTR )…ప్రస్తుతం ఎన్టీయార్ దేవర సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది.ఇక ఈ సాంగ్ మీద మొదటి నుంచి కూడా చాలా విమర్శలైతే వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్( Anirudh Ravichander) ఈ సినిమా మ్యూజిక్ లో అసలు ఇంట్రెస్ట్ పెట్టనట్టుగా కనిపిస్తుంది.ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సాంగ్ ఫెయిల్ అవుతూనే వస్తుంది.
ఇక మొన్నటికి మొన్న మొదటి సాంగ్ రిలీజ్ చేశారు.
అది అంత పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు.ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కావడం లేదు.కానీ అనిరుధ్ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు…అలాగే కొరటాల శివ( Koratala Shiva ) మీద కూడా భారీ విమర్శలైతే చేస్తున్నారు.
ఎందుకంటే దేవిశ్రీప్రసాద్ కొరటాల శివకు మధ్య మంచి కాంబినేషన్ కుదిరింది.ఇక వీళ్ళ కాంబో లో చేసిన మొదటి నాలుగు సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
దానివల్ల ఆ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.మరి ఆ తర్వాత మణిశర్మ, అనిరుధ్ లను పెట్టుకోవడం ఎందుకు దేవి శ్రీ ప్రసాద్ ని పెట్టుకుంటే బాగుండేది కదా అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
అనిరుధ్ తమిళ్ సినిమాలకు మాత్రమే మంచి మ్యూజిక్ ఇస్తాడు.తెలుగు సినిమాలకు అసలు ఆయన మ్యూజిక్ ఇవ్వడు.ఆయనకి ఇవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు.
మరి ఇకమీదటైనా అనిరుధ్ ను తీసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన ప్లేస్ లో వేరేవాళ్లను తీసుకుంటే బావుంటుందని కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
.