తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో రవితేజ ఒకరు.
ప్రస్తుతం రవితేజ ‘మిస్టర్ బచ్చన్( Mr.Bachchan )’ అనే సినిమాతో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల మంచి అంచనాలు అయితే ఉన్నాయి.ఇక ఈ సినిమాకి హరీష్ శంకర్ ( Harish Shankar )డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాతో కనుక రవితేజ సక్సెస్ కొడితేనే ఆయన ఇండస్ట్రీలో మార్కెట్ భారీ గా కొనసాగుతుంది.
లేకపోతే మాత్రం ఇంతకుముందు వరుసగా ఆయన చేసిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి కాబట్టి దాంతో ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది.ఇక ఇప్పుడు ఆ మార్కెట్ రికవరీ అవ్వాలంటే మాత్రం ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ట్రైలర్ అంత ఆసక్తి గా లేనప్పటికీ ఇది రవితేజ సినిమా కాబట్టి చాలామంది ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్టున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఆగస్టు 15 వ తేదీన రవితేజ హరీష్ శంకర్ కాంబోలో మరొక సినిమా సక్సెస్ పడిందా లేదంటే సినిమా ఫ్లాప్ అయిపోయిందా అనే విషయాలు తెలుస్తాయి…
ఇక రవితేజ లాంటి హీరో ఒక సినిమా చేయడానికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.ఇక గోపీచంద్ మలినేని(Gopichand Malineni ) డైరెక్షన్ లో రవితేజ చేయాల్సిన సినిమా భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమాను క్యాన్సిల్ చేసి ప్రస్తుతం అదే స్టోరీ తో బాలీవుడ్ స్టార్ హీరో అయిన సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్నాడు.రవితేజ తో ఓవర్ బడ్జెట్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఆయన తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచుకోవడమే అలా కాకుండా రెమ్యూనరేషన్ కనక కొంచెం తగ్గించుకున్నట్లయితే ఆ సినిమా రవితేజ చేసేవాడు…ఇలా మన రవితేజ వల్ల తెలుగు సినిమాలు బాలీవుడ్ హీరోలు చేయాల్సి వస్తుంది…
.