ప్రస్తుత రోజుల్లో చాలా మంది మేకప్ లేకుండా కాలు కూడా బయట పెట్టడం లేదు.అమ్మాయిలే కాదు కొందరు అబ్బాయిలు సైతం మేకప్‌కు బాగా అలవాటు పడ్డాయి.
అయితే మేకప్ లేకున్నా ముఖం చందమామలా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.కానీ, అది అసాధ్యమని నమ్ముతుంటారు.
వాస్తవానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటే అది సాధ్యం అవుతుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే గనుక మేకప్ లేకున్నా ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో ఒక గుడ్డు పచ్చసొనను వేసుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు, వన్ టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, మూడు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని విస్కర్ సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు బ్రెష్ సాయంతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి.

పది హేను నిమిషాల పాటు ఆరనిచ్చి.మళ్లీ బ్రెష్‌తో మరో కోటింగ్‌ను వేసుకోవాలి.డ్రై అయిన అనంతరం నార్మల్ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై తడి లేకుండా టవల్‌తో చర్మాన్ని తుడుచుకుని.మీ స్కిన్‌కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.మూడు రోజులకు ఒక సారి ఈ ప్యాక్‌ను వేసుకుంటే గనుక.
చర్మం వైట్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.స్కిన్‌పై ఏమైనా మచ్చలు ఉంటే క్రమంగా తొలగి పోతాయి.
అలాగే కొందరికి చిన్న వయసులోనే స్కిన్ సాగిపోతుంటుంది.అలాంటి వారు పైన చెప్పిన ప్యాక్‌ను వేసుకుంటే.
సాగిన చర్మం మళ్లీ టైట్‌గా మారుతుంది.మరియు ముడతల సమస్య సైతం దూరం అవుతుంది.