టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 800 కోట్ల గ్రాస్ ను దాటి 1000 కోట్ల వైపు పరుగులు పెడుతోంది.
రాజమౌళి అండ్ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప్రస్తుతం సినిమా సక్సెస్ మీట్ ను భాగంగా ఎంజాయ్ చేస్తోంది.ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తూ వెళ్తుంది.
రాజమౌళి తన తదుపరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దర్శకుడు రాజమౌళి ఏకంగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.బాహుబలి సినిమా విజయం తరువాత హీరో అమీర్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ని సంప్రదించారట.
రాజమౌళి దర్శకత్వంలో మహాభారతం చిత్రంలో నటించాలి అన్నది హీరో అమీర్ ఖాన్ కోరిక.అయితే ఇందుకోసం మహాభారతం స్క్రిప్ట్ సిద్ధం చేసి ఇవ్వాలి అని అమీర్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ను రిక్వెస్ట్ చేశారట.
అప్పుడే ఆ విషయంపై విజయేంద్రప్రసాద్ స్పందిస్తూ మహాభారతం అంటే కనీసం ఐదు ఆరు భాగాలుగా ఉంటుంది.

అంత పెద్ద స్క్రిప్టు రాసే సమయం నాకు లేదు వేరే కమిట్మెంట్స్ వల్ల కొంత సమయం కేటాయించ లేను.కానీ కథ అవుట్ లైన్ఏ పార్టీ నుండి ఎక్కడి వరకు ఉండాలి అన్న ప్లాన్ సిద్ధం చేసి మాత్రం ఇవ్వగలను,కానీ స్క్రిప్ట్ మాత్రం వేరే వాళ్ళతో రాయించు కోవాలని అమీర్ ఖాన్ కు విజయేంద్రప్రసాద్ సూచించారట.అమీర్ ఖాన్ కు మహాభారతం అంటే చాలా ఇష్టం.
దీంతో ఆ సినిమాను డైరెక్ట్ చేయాలని స్వయంగా అమీర్ ఖాన్ రాజమౌళి ని కోరగా, అప్పుడు రాజమౌళి మాత్రం అమీర్ ఖాన్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట.మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఆ చిత్రాన్ని తెరకెక్కించి సామర్థ్యం పొందడానికి నాకు ఇంకా టైం పడుతుంది అలాగే ప్రస్తుతం తన కమిట్మెంట్ వల్ల ఇంకా టైమ్ పడుతుందని రాజమౌళి అమీర్ ఖాన్ కు చెప్పినట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారు.







