ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) సంచలనాలు కొనసాగే అవకాశం ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జవాన్ మూవీ ఆల్ టైమ్ కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేసింది.
అత్యధిక వసూళ్లను దాటిన నాలుగో మూవీగా ఈ సినిమా నిలిచింది.
బాహుబలి2, కేజీఎఫ్2, ఆర్.ఆర్.ఆర్ ఈ సినిమా కంటే ముందువరసలో ఉన్నాయి.సినిమా విడుదలై 40 రోజులు అవుతున్నా కల్కి సినిమా సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కల్కి టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
టికెట్ రేట్లు తగ్గడం వల్ల ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెరుగుతుండటం గమనార్హం.కల్కి సీక్వెల్( Kalki 2 ) 2026 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సోమవారం రోజున ఈ సినిమాకు సంబంధించి 10,000 టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం అందుతోంది.బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం చిన్న సినిమాలు ప్రదర్శితం అవుతున్నా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆశించిన రేంజ్ లో మెప్పించలేదనే సంగతి తెలిసిందే.
కల్కి సీక్వెల్ 2026లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
కల్కి సీక్వెల్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కల్కి 2898 ఏడీ నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా స్పెషల్ సినిమాగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.