డైరెక్టర్లు నిర్మాతలను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి వ్యక్తుల్లో టి.రాజేందర్ ఒకరు.
సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడు రమేష్‌బాబు( Ramesh Babu) సినిమా నిర్మాతలను అతను మోసం చేశాడు.రమేష్‌బాబు ‘సామ్రాట్ (1987) ’ సినిమాతో హీరో అయ్యాడు.
ఇది హిట్ కావడంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అదేకాలంలో డైరెక్టర్ టి.
రాజేందర్ ‘ప్రేమసాగరం (1983)’, ‘ప్రేమ సామ్రాజ్యం’, ‘మైథిలీ నా ప్రేయసి’ సినిమాలతో పెద్ద హిట్స్ సాధించాడు.రమేష్‌బాబు హీరోగా రాజేందర్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తే కుమారుడి లైఫ్ సెట్ అయిపోతుందని కృష్ణ భావించారు.రాజేందర్ రమేష్‌బాబుతో సినిమా తీయడానికి ఒప్పుకున్నాడు.1988లో రమేష్‌బాబు, టి.రాజేందర్ కాంబో ‘ప్రేమచరిత్ర’ టైటిల్‌తో ఒక మూవీ స్టార్ట్ అయింది.ఇందులో హీరోయిన్‌గా శ్రీభారతిని తీసుకున్నారు.4 షెడ్యూల్స్‌లో మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలనుకున్నారు.కృష్ణ సోదరుడు హనుమంతరావు బావమరుదులు శాఖమూరి రాంబాబు, శాఖమూరి సూరిబాబు దీనికి నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ మూవీ సెకండ్ షెడ్యూల్‌లో హీరోయిన్ తాను చెప్పినట్లు యాక్ట్ చేయడం లేదని ఆమెపై డైరెక్టర్ రాజేందర్ చేయి చేసుకున్నాడు.దాంతో ఆమె ఈ సినిమా చేయనని వెళ్లిపోయింది.ఆమె స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ చాందిని( Chandini )ని తీసుకొచ్చారు.అయితే అనివార్య కారణాలవల్ల మూడో షెడ్యూల్ షూటింగ్ సరిగా జరగలేదు.కొన్ని నెలలపాటు షూటింగ్ నిలిపేశారు.1989, డిసెంబర్ 15న మళ్లీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు.
ఈ గ్యాప్‌లో రాజేందర్ కథలో మార్పులు చేసుకున్నాడు.ముందుగా తీసిన మొత్తం సినిమాను స్క్రాప్ చేసి కొత్త కథతోనే ఫ్రెష్‌గా షూటింగ్ కంటిన్యూ చేశాడు.ఆల్రెడీ తీసుకున్న ఆర్టిస్టులను కూడా తొలగించాడు.ఈ మూవీ షూటింగ్ ఆపకుండా కంప్లీట్ చేశాడు.ముందుగా ప్రేమచరిత్ర సినిమా పాటలు విడుదలై సూపర్‌హిట్ అయ్యాయి.కానీ మూవీ మాత్రం రిలీజ్ కాలేదు దానికి కారణం సినిమా స్టార్టింగ్‌కు ముందే రాజేందర్ తయారు చేయించిన ఓ అగ్రిమెంట్.
ఇందులో ఏముందో చదవకుండానే ప్రొడ్యూసర్లు సైన్ చేశారు.ఆ అగ్రిమెంట్‌ని తనకు పూర్తి అనుకూలంగా ప్రిపేర్ చేయించాడు రాజేందర్.
దాని ప్రకారం ‘ప్రేమచరిత్ర’ మూవీ ఫుల్ రైట్స్ రాజేందర్ సొంతమయ్యాయి.ఈ విషయం చివరికి తెలుసుకున్నాక నిర్మాతలు రాజేందర్‌తో గొడవ పడ్డారు.
వీళ్ళ మధ్య గొడవల వల్ల ‘ప్రేమచరిత్ర’ థియేటర్లలో రిలీజే కాలేదు.హక్కులు తన సొంతమయ్యాయి కాబట్టి రాజేందర్ ఇదే చిత్రానికి కొన్ని మార్పులు చేసి ‘శాంతియాంతు శాంతి( SHANTHI ENATHU SHANTHI )’ టైటిల్‌తో తమిళంలో రిలీజ్ చేశారు.
తమిళ వెర్షన్‌లో రాజేందర్, రాధ దంపతులుగా యాక్ట్ చేశారు.ఆ సినిమా తమిళంలో సూపర్‌హిట్ అయింది.
రాజేందర్‌కు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి.అలా రమేష్‌బాబు నటించిన సినిమా తమిళ్‌లో విడుదల అయింది కానీ తెలుగులో రిలీజ్ కాలేదు.
టి.రాజేందర్ ప్రాఫిట్స్ అందుకోగలిగాడు కానీ తెలుగు నిర్మాతలు రాంబాబు, సూరిబాబు ఆరిపోయారు.‘ప్రేమచరిత్ర’ సినిమా రిలీజ్ చేసి ఉంటే రమేష్ బాబు కెరీర్ మరోలాగా ఉండేది.కృష్ణ కూడా మూవీ రిలీజ్ కాలేదని డిస్సప్పాయింట్.