ప్రకృతి నిజ జీవితంలో కనిపించినా సినిమాల్లో కనిపించినా మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఫస్ట్ తెలుగు టాకీ మూవీ “భక్త ప్రహ్లాద( Bhakta Prahlada ) (1932)”లో కూడా ప్రకృతిని బాగా చూపించారు.
అప్పటినుంచి సినిమాల్లో ప్రకృతి ఒక భాగం అయిపోయింది.అయితే సినిమాల్లో ఈ ప్రకృతి అనేది నిజమైనది కాదు.
అప్పట్లో సినిమాలన్నీ స్టూడియోల్లోనే షూట్ చేసేవారు, కొండలు పొలాలు, పార్కులు లాంటి ప్రదేశాలు చూపించాల్సి వస్తే ఓ తెరకట్టి దానిపై పొలాలు, కొండలు పెయింట్ చేసేవారు.కాలక్రమేణా సెట్టింగులు వేయడం మొదలుపెట్టారు.ఔట్ డోర్ షూటింగ్ అవసరం లేకుండానే స్టూడియోలోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేవారు.1970 నుంచి ఇలాంటి అసహజమైన ప్రకృతిని కాకుండా సహజమైన ప్రకృతిని చూపించడం మొదలుపెట్టారు.ఊటీ కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.ఇక భారీ బడ్జెట్ సినిమాలు విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకునేవి.
అయితే చాలా సినిమాలకు కొన్ని నేచురల్ లొకేషన్స్ గో-టూ ప్లేసెస్ గా ఉండేవి.అలాంటి వాటిలో గోదావరి ఒడ్డున ఉన్న కుమారదేవం చెట్టు ఒకటి.ఇక్కడ షూటింగ్ ఇస్తే ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందే.ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్న దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.ఈ చెట్టు 150 ఏళ్ల పాటు 300 సినిమాల్లో కనిపించింది.ఈ చెట్టును చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యేవారు.“గోదారి గట్టుంది.గట్టు మీద సెట్టుంది.
సెట్టు కొమ్మన పిట్టుంది.పిట్ట మనసులో ఏముంది.?” వంటి పాటలు కూడా ఈ చెట్టుకు పైన రాశారు.
మూగమనసులు (1964)( Mooga Manasulu )లోని ఆ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ చెట్టుకు దాదాపు 150 ఏళ్లు బతుకుతూ సినీ మహా వృక్షంగా పేరు తెచ్చుకుంది.ఎన్నో పక్షులు ఈ వృక్షం పైన దాచుకునేవి.
షూటింగ్ స్పాట్‌గా చాలా ఏళ్లు నిలిచిన ఈ వృక్షం ప్రస్తుతం కూలిపోయింది.సినిమా దర్శకులు హీరో హీరోయిన్లకు ఈ చెట్టు చాలా సెంటిమెంట్.
ఇది పక్కా హిట్ ఇస్తుందని నమ్మేవారు.తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, కుమారదేవంలో ఉన్న ఈ చెట్టు ఉంటుంది అయితే ఇది అక్టోబర్ 5న సోమవారం తెల్లవారుజామున కూలిపోయి అందరికీ బాధ కలిగించింది.
గోదావరి వరద తీవ్రంగా కొట్టడం వల్ల ఈ చెట్టు నేల కూలింది.ఇదొక నిద్ర గన్నేరుచెట్టు.గోదారితల్లి ఒడ్డున నాటిన వ్యక్తి పేరు శ్రీ సింగలూరి తాతబ్బాయి.150 ఏళ్లుగా వరదలు తుఫాన్లు తట్టుకుంటూ వస్తున్నాయి మహావృక్షం కూలిపోవడంతో చాలామంది కంటతడి పెట్టుకుంటున్నారు.ఈ సినిమా చెట్టు కింద పాడిపంటలు, దేవత ,వంశవృక్షం, బొబ్బిలిరాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు చెప్పుకుంటూ పోతే మొత్తం చాలా సినిమాల షూటింగ్ జరిగింది.ఈ సినిమా చెట్టు కింద ఒక్క సీన్ తీసిన అది హిట్టు అన్న సెంటిమెంటు చాలామందిలో కలిగింది ముఖ్యంగా దర్శకుడు వంశీ ఈ సినిమా చెట్టు లేకుండా తన మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడు.
రాఘవేంద్రరావు, దాసరి , జంధ్యాల, ఇవివి వంటి గొప్ప దర్శకులు కూడా దీని కింద సినిమాలు తీశారు.ఈ చెట్టు వద్ద 308 సినిమాలు షూట్ చేయగా ఒక్క వంశీనే 18 చిత్రాల షూటింగ్ ఇక్కడ పూర్తి చేశాడు.