యంగ్ టైగర్ నీల్ ప్రాజెక్ట్ కు ముహూర్తం ఫిక్స్.. మహేష్ పుట్టినరోజున తారక్ సర్ప్రైజ్ ఇస్తారా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మన అందరికి తెలిసిందే.కాగా ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Muhurat Fixed For Ntr Prashanth Neel Project, Ntr, Prashanth Neel, Tollywood, M-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటుతో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్.ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ( Devara movie )లో నటిస్తూనే మరోవైపు వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Telugu Devara, Mahesh Babu, Muhurat Fixed, Mythri Makers, Prashanth Neel, Tollyw

అలాగే తారక్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అయితే ఆగష్టు నుంచి మొదలు కావాల్సిన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth neel ) ఎన్టీఆర్ కాంబో మూవీ పై ఎలాంటి అప్ డేట్ లేదు.మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఈ మాస్ కాంబోపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

కానీ ఈ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందో తెలియక అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

Telugu Devara, Mahesh Babu, Muhurat Fixed, Mythri Makers, Prashanth Neel, Tollyw

తాజాగా నీల్ ఎన్టీఆర్ మూవీ ఆగష్టు 9 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది.అది కూడా హైదరాబాద్ లోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోనుందట.అది వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

ఆగష్టు లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైనా సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కి వెళుతుంది అని సమాచారం.అయితే ఆగస్ట్ 9 న మహేష్ బాబు పుట్టినరోజు ఉన్న విషయం తెలిసిందే.

అంటే మహేష్ బాబు పుట్టినరోజు నాడు తారక్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube