యంగ్ టైగర్ నీల్ ప్రాజెక్ట్ కు ముహూర్తం ఫిక్స్.. మహేష్ పుట్టినరోజున తారక్ సర్ప్రైజ్ ఇస్తారా?
TeluguStop.com
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మన అందరికి తెలిసిందే.
కాగా ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటుతో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్.
ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ( Devara Movie )లో నటిస్తూనే మరోవైపు వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
"""/" /
అలాగే తారక్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆగష్టు నుంచి మొదలు కావాల్సిన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఎన్టీఆర్ కాంబో మూవీ పై ఎలాంటి అప్ డేట్ లేదు.
మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఈ మాస్ కాంబోపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
కానీ ఈ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందో తెలియక అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
"""/" /
తాజాగా నీల్ ఎన్టీఆర్ మూవీ ఆగష్టు 9 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది.
అది కూడా హైదరాబాద్ లోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోనుందట.అది వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
ఆగష్టు లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైనా సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కి వెళుతుంది అని సమాచారం.
అయితే ఆగస్ట్ 9 న మహేష్ బాబు పుట్టినరోజు ఉన్న విషయం తెలిసిందే.
అంటే మహేష్ బాబు పుట్టినరోజు నాడు తారక్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు.
భూమిక విడాకుల విషయంలో నాగార్జున జోక్యం.. అసలు సంగతి తెలిసి మతిపోయింది..?