ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress Party ) ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.పార్టీకి చెందిన కీలక నేతలు చాలామంది ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా , మరి కొంత మంది రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ నుంచి వలసలు పెరగకుండా వైసిపి అధిష్టానం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా. ఈ వలసలకు బ్రేకులు మాత్రం పడడం లేదు.
తాజాగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసిపికి రాజీనామా చేయబోతున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా దొరబాబు సైతం వైసీపీకి( YCP ) రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
![Telugu Ap Cm, Ap, Dorababu, Pavan Kalyan, Pendem Dorababu, Pitapuram, Pitapuram Telugu Ap Cm, Ap, Dorababu, Pavan Kalyan, Pendem Dorababu, Pitapuram, Pitapuram](https://telugustop.com/wp-content/uploads/2024/08/Dora-Babu-is-giving-hand-to-Jagan-which-party-are-you-joiningc.jpg)
ఇప్పటికే వైసీపీ అధిష్టానం పెద్దలకూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారట. దొరబాబు తో పాటు , నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు వైసిపిని వీడనున్నట్లు సమాచారం. వీరంతా బుధవారం రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు జగన్ టికెట్ నిరాకరించారు. అక్కడి నుంచి టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పోటికి దిగడంతో, వంగ గీతను అభ్యర్థిగా జగన్ బరిలోకి దించారు.ఆ ఎన్నికల్లో పవన్ చేతిలో గీత కూడా ఓటమి చెందారు.
వైసీపీలోనే కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు ఏర్పడతాయని భావిస్తున్న దొరబాబు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట.
![Telugu Ap Cm, Ap, Dorababu, Pavan Kalyan, Pendem Dorababu, Pitapuram, Pitapuram Telugu Ap Cm, Ap, Dorababu, Pavan Kalyan, Pendem Dorababu, Pitapuram, Pitapuram](https://telugustop.com/wp-content/uploads/2024/08/Dora-Babu-is-giving-hand-to-Jagan-which-party-are-you-joiningd.jpg)
ఈ మేరకు జనసేన పెద్దలతోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎన్నికలకు ముందు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తానని జగన్( Jagan ) హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోవడంతో, అప్పటి నుంచి వర్మ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారట. ఇటీవల ఢిల్లీలో వైసిపి నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి వర్మ హాజరు కాలేదు.
తన పుట్టినరోజు సందర్భంగా భారీగా అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారట. ఆ సమయంలో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్ లలో ఎక్కడా వైసిపి జెండా, జగన్ ఫోటో కనపడకపోవడంతో దొరబాబు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపు అందుకుంది.
రేపు దీనిపై మరింత క్లారిటీ రానుంది.