అగ్రరాజ్యం అమెరికా( America )లో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.
జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ తుపాకుల స్వైరవిహారం వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.
ఈ తుపాకీ కాల్పుల్లో భారతీయులు సహా పలువురు విదేశీయులు కూడా మరణిస్తున్నారు.
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఆగస్టు 5, 2012లో విస్కాన్సిన్( Wisconsin ) రాష్ట్రంలోని ఓక్ క్రీక్ ప్రాంతంలో ఉన్న సిక్కు ప్రార్థనా మందిరంలో ఓ శ్వేతజాతీయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు.గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.ఈ ఘటనలో ఏడుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోగా.
ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఊచకోతలో సువేగ్ సింగ్ ఖత్రా (84), సత్వంత్ సింగ్ కలేక (65), రంజిత్ సింగ్ (49), సీతా సింగ్ (41), పరమజిత్ కౌర్ (41), ప్రకాష్ సింగ్ (39), బాబా పంజాబ్ సింగ్ (72)లు ప్రాణాలు కోల్పోయారు.
ఉన్మాది కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పంజాబ్ సింగ్ పక్షవాతానికి గురై తీవ్ర అనారోగ్యంతో మార్చి 2020లో మరణించాడు.
ఈ సందర్భంగా నాటి మృతులకు అమెరికా చట్టసభ సభ్యులు నివాళులుర్పించారు.మతోన్మాదాన్ని తిరస్కరించి, ద్వేషం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడేందుకు .అలాగే అమెరికాలో తుపాకీ హింసను అంతం చేయడానికి కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు.ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి లిండా థామస్( UN Linda Thomas ) విస్కాన్సిన్ గురుద్వారాను సందర్శించారు.నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని గౌరవించటానికి, అట్టడుగు వర్గాలపై ద్వేషాన్ని ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలపై ప్రసంగించారు.
ది కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) సభ్యులు కూడా ఒక ప్రకటనలో బాధితులకు సంతాపం తెలిపారు.