హైపర్ ఆది( Hyper Aadi ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.ఇక హైపర్ ఆది జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
అయితే ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు, ఢీ డాన్స్ షో కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు.
ఇందులో భాగంగా గతంలో అనసూయ( Anasuya ) శేఖర్ మాస్టర్( Sekhar Master ) పోటీపడి కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో షర్ట్లు విప్పిన సంగతి మనకు తెలిసిందే.ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తాజాగా హైపర్ ఆది శేఖర్ మాస్టర్ కు పరోక్షంగా వేసిన పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మా దగ్గర బట్టన్ తీయమంటేనే సిగ్గుపడతారు.కానీ అక్కడ మాత్రం కోటు మొత్తం తీసేసారు అంటూ ఆ సంఘటనను గుర్తు చేస్తూ పరోక్షంగా అనసూయ శేఖర్ మాస్టర్ పై పంచులు వేశారు.
హైపర్ ఆది ఇలాంటి కామెంట్లు చేయడంతో వెంటనే శేఖర్ మాస్టర్ స్టేజ్ పైకి వచ్చి ఆ షోలో ఏ విధంగా అయితే తన కోటు విప్పారో ఇక్కడ కూడా అదే విధంగా కోటు విప్పి రచ్చ చేశారు.ఏది ఏమైనా హైపర్ ఆది స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో అనసూయ శేఖర్ మాస్టర్ చేసిన పని పట్ల సెటైర్స్ వేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక అనసూయ గతంలో జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు అయితే ప్రస్తుతం ఈమె ఈటీవీలో కాకుండా స్టార్ మా లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.