ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి తర్వాత భోజనం చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..!

ప్రస్తుత రోజులలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ కాస్త పెరిగింది అని చెప్పవచ్చు.ప్రతి ఒక్కరు హెల్త్ కాపాడుకునే విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Eating After 1pm Every Day But This Is For You , Stomach Problem , Health ,-TeluguStop.com

అయితే ఆహారం తీసుకునే వేళలు కూడా ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.కానీ ఇప్పటి వరకు చాలా మంది దీన్ని పాటించకుండా ఉన్నారు.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నాక దిన చర్యలో కొన్ని చిన్న విషయాలను మర్చిపోతారు.ఇది వారి శరీరం పై దుష్ప్రభావాలను కలిగిస్తుంది.

Telugu Acidity, Gas Problem, Headache, Tips, Meal, Stomach Problem-Telugu Health

ఆరోగ్యం సరి అయిన దారిలో ఉండాలంటే ఆహారాన్ని సమయానికి తీసుకోవడం మొదలుపెడితే అనేక పొట్ట సంబంధిత సమస్యల( Stomach Problem )ను నివారించవచ్చు.ఆలస్యంగా భోజనం( Meal ) చేయడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల మధ్య అంటే సరైన సమయానికి భోజనం చేయకపోతే కడుపులో ఎసిడిటీ సమస్య వస్తుంది.సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనేక ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

అటువంటి పరిస్థితుల్లో పొట్ట వ్యాధులను నివారించాలంటే సరైన సమయంలో భోజనం చేయాలి.

Telugu Acidity, Gas Problem, Headache, Tips, Meal, Stomach Problem-Telugu Health

కడుపులో ఎసిడిటీ( Acidity ) ఏర్పడినప్పుడు దానిని వైద్యభాషలో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి లేదా యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి అని అంటారు.ముఖ్యంగా చెప్పాలంటే సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తలనొప్పి( Headache ) వస్తుంది.ఆకలి వల్ల ఇది వస్తుంది.

భోజనం ఆలస్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతుంది.ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది.

అలాగే కొన్ని సార్లు చిరాకు కూడా వస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే మధ్యాహ్నం భోజనం చేయకపోతే కడుపులో గ్యాస్ సమస్య( Gas problem ) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, మిథైన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో తయారైన వాయువులు కూడా పొత్తి కడుపు లో నొప్పిని కలిగిస్తాయి.అటువంటి పరిస్థితిలో ఆలస్యంగా భోజనం చేసేవారు ఈ అలవాటును దూరం చేసుకోవడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube