అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని గ్లేసియర్ నేషనల్ పార్క్( Glacier National Park )లో గల్లంతైన భారతీయ యువకుడి మృతదేహం దాదాపు నెల రోజుల తర్వాత లభ్యమైంది.మృతుడిని సిద్ధాంత్ విఠల్ పాటిల్‌గా గుర్తించారు.
ఇతను కాలిఫోర్నియా( California ) రాష్ట్రంలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.జూలై 6న స్నేహితులతో కలిసి గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో విహారయాత్రకు వెళ్లగా.
అక్కడి అవలాంచె క్రీక్‌లో పడి సిద్ధాంత్ మునిగిపోయినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.రాళ్లు, చెట్ల మధ్యలో అతని మృతదేహం చిక్కుకుపోయి ఉండొచ్చని రేంజర్లు అనుమానిస్తున్నారు.
అయినప్పటికీ పాటిల్ డెడ్ బాడీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.నీటి ప్రవాహం కారణంగా రేంజర్లు ఈ గ్లేసియర్ పార్క్‌లోని ప్రమాదకరమైన ప్రాంతాలకు చేరుకోలేకపోయారు.
ఆగస్ట్ 4న ఉదయం 10.30 గంటల సమయంలో ఓ సందర్శకుడికి లోయలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో అధికారులకు సమాచారం అందించాడు.రంగంలోకి దిగిన రేంజర్లు పరిశీలించగా పాటిల్ వేసుకున్న దుస్తులు మృతదేహంపై కనిపించడంతో అది సిద్ధాంత్దేనని నిర్ధారించుకున్నారు.ఫ్లాట్‌హెడ్ కౌంటీ కరోనర్.డీఎన్ఏ లేదా దంతాల రికార్డుల ద్వారా మృతదేహాన్ని నిర్ధారించడానికి శ్రమిస్తున్నారు.
సిద్ధాంత్ బంధువు ప్రితేష్ చౌదరి ( Pritesh Chaudhary )మీడియాతో మాట్లాడుతూ.పాటిల్ మృతదేహాన్ని కనుగొన్నట్లు అమెరికా అధికారులు తమకు సమాచారం అందించారని తెలిపారు.గాలింపు చర్యల సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ నేత ప్రేమ్ భండారీకి ప్రితేష్ ధన్యవాదాలు తెలిపారు.
త్వరలోనే సిద్ధాంత్ పాటిల్ మృతదేహం భారతదేశానికి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.ఈ విషాదం చోటు చేసుకోవడానికి కొన్ని గంటల ముందు గ్లేసియర్ నేషనల్ పార్క్ నుంచే తన తల్లికి సిద్ధాంత్ ఫోన్ చేసినట్లు ప్రీతేష్ తెలిపారు.
తాను మరో ఆరుగురు భారతీయ స్నేహితులతో కలిసి మూడు రోజులు పార్క్‌లో ఉన్నామని, ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నామని తల్లితో చెప్పినట్లు వెల్లడించారు.అలాగే మరణించడానికి రెండు గంటల ముందు కూడా తల్లికి మెసేజ్ చేశాడని ప్రీతేష్ చెప్పారు.
మరో మూడు రోజుల్లో శాన్ జోస్‌కు తిరిగి వెళ్తానని సిద్ధాంత్ అందులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.సిద్ధాంత్ తల్లిదండ్రులు ప్రీతి, విఠల్‌లు మహారాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇటీవలే పదవీ విరమణ చేశారని.
సిద్ధాంత్ మరణవార్తతో వారు షాక్‌లో ఉన్నారని ప్రీతేష్ వెల్లడించారు.