భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. సమంత( Samantha ) సిటాడెల్ హనీబన్నీ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని బాలీవుడ్ ( Bollywood )మీడియా వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
సమంత పారితోషికం లెక్కల గురించి తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత షాకవుతున్నాయి.
సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్ల పారితోషికాలు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి.సౌత్ లో 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడం సాధారణ విషయం కాదని సమంత మాత్రం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటం వల్లే ఈ స్థాయిలో పారితోషికం తీసుకోగలుగుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.స్టార్ హీరోయిన్ సమంత రేంజ్ గురించి ఆమె రెమ్యునరేషన్ ద్వారా వెల్లడవుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
నవంబర్ నెల 7వ తేదీ నుంచి సిటాడెల్ హనీ బన్నీ( Citadel Honey Bunny ) అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి హాట్ టాపిక్ అవుతోంది.ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని భోగట్టా.సౌత్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పరంగా సమంతనే టాప్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఫ్యామిలీ మేన్ సీజన్2 తో సమంత ఇప్పటికే మంచి పేరును సొంతం చేసుకున్నారు.సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంత లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ తో సక్సెస్ సాధిస్తే ఆమె మరిన్ని వెబ్ సిరీస్ లలో ఛాన్స్ దక్కించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
సామ్ తన క్రేజ్ తో ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యపరుస్తున్నారు.సమంత సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను పెంచుకుంటున్నారు.