సాధారణంగా చాలామంది చదివిన స్కూల్స్, కాలేజీలకు భారీ మొత్తంలో విరాళం ఇవ్వడానికి అస్సలు ఆసక్తి చూపించరు.అయితే తెలుగు తేజం కృష్ణా చివుకుల మాత్రం తన మంచి మనస్సును చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అమెరికా, బెంగళూర్ లలో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కృష్ణా చివుకుల( Krishna Chivukula ) అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృ దేశంపై మమకారాన్ని చాటుకున్నారు.
తాను ఇంజనీరింగ్ చదివిన ఐఐటీ మద్రాస్ ( IIT Madras )కు ఆయన ఏకంగా 228 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు.ఐఐటీ రూల్స్ ప్రకారం విరాళాలు ఇచ్చే దాతలతో ఒప్పందాలు చేసుకోవాలి.ఈ నెల 6వ తేదీన జరిగిన ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనడానికి కృష్ణా చివుకుల ప్రత్యేకంగా అమెరికా నుంచి చెన్నైకు వస్తున్నారు.
ఏపీలోని బాపట్లకు చెందిన కృష్ణా చివుకుల మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు.ఐఐటీ బాంబేలో బీటెక్ చదివిన ఆయన 1970 సంవత్సరంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ పూర్తి చేయడం జరిగింది.
హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కృష్ణా చివుకుల ఎంబీఏ డిగ్రీ అందుకుని తుముకూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు.యూఎస్ లోని ప్రముఖ హాఫ్ మన్ ఇండస్ట్రీస్ కు తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోగా ఆయన పని చేయడం జరిగింది.
ఆ తర్వాత న్యూయార్క్ కేంద్రంగా కృష్ణా చివుకుల శివ టెక్నాలజీస్( Shiva Technologies ) ను మొదలుపెట్టారు.1997లో తొలిసారి మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది కృష్ణానే కావడం గమనార్హం.ప్రస్తుతం కృష్ణా చివుకుల ఇండో యూఎస్ ఎం.ఐ.ఎం.టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నెలకొల్పి ఆ సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.కృష్ణా చివుకుల ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని చెప్పడంలో ఎలాంటి సందేహం మాత్రం అక్కర్లేదు.కృష్ణా చివుకులని ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు.