ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా టూరిస్టులను( Tourists ) మోసం చేసే వాళ్లు ఎప్పుడూ కాచుకొని కూర్చుంటారు.మన దేశంలో కూడా ఇలాంటి మోసగాళ్లు ఉన్నారు.
రీసెంట్ గా సింగపూర్( Singapore ) నుంచి ఓల్డ్ ఢిల్లీకి( Old Delhi ) వచ్చిన ఒక పర్యాటకురాలు ఇలాంటి ఓ మోసగాడు చేతిలో మోసపోయింది.రిక్షా పుల్లర్( Rickshaw Puller ) కారణంగా చాలా భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొంది.
ఈ సంఘటన గురించి ఆ ట్రావెల్ వ్లాగర్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో వివరించింది.ఆమె పేరు సిల్వియా చాన్.
సిల్వియా( Sylvia ) చెప్పిన దాని ప్రకారం, ఆమె, ఆమె స్నేహితురాలు ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో రిక్షా పుల్లర్ను కలిశారు.ఆ వ్యక్తి వారితో తన రిక్షా రైడ్ నచ్చితే నచ్చినంత మనీ ఇవ్వవచ్చని చెప్పాడు.ఆపై ఆ రిక్షా పుల్లర్ సిల్వియా, ఆమె స్నేహితురాలను జామా మసీద్( Jama Mosque ) నుంచి రెడ్ ఫోర్ట్ వరకు తీసుకెళ్లి, ప్రయాణం ముందు నిర్ణయించిన రూ.100 తీసుకోవడానికి నిరాకరించాడు.అంతేకాకుండా, వారిని గమ్యస్థానం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేసి, 6000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
సిల్వియా చెప్పినట్లుగా, రిక్షా పుల్లర్ వారికి చాందనీ చౌక్( Chandini Chowk ) నుంచి పికప్ చేసుకునే సమయంలో డబ్బులు ఇవ్వాలని చెప్పాడు.వాళ్లు ఫోన్ నంబర్లు మార్చుకుని, తమకు రిక్షా కావాలి అనుకున్నప్పుడు మెసేజ్ పంపించాలని నిర్ణయించారు.కానీ వాళ్లు మసాలా మార్కెట్ చూడాలనుకున్నప్పుడు, రిక్షా పుల్లర్ “మిమ్మల్ని దింపాల్సిందే ఇక్కడే” అని అబద్ధాలు ఆడాడు.
వారికి చాలా కొత్త ప్రదేశమైన చోట దింపేశాడు.తర్వాత 6000 ఇవ్వాలని డిమాండ్ చేయగా సిల్వియా రూ.2000 ఇచ్చి చాలా నష్టపోయింది.ఇలాంటి రిక్షాపుల్లర్లకి సపోర్ట్ చేయాలని తమకు ఉంటుందని, కానీ ఈ మోసాలు చూస్తుంటే ఉబర్ వంటి సర్వీసుల వైపే మొగ్గు చూపించాలని అనిపిస్తోందని ఆమె చెప్పింది.
ఈ రిక్షా పుల్లర్ చాలా చెడ్డవాడు, చెత్త ప్రదేశాలకు తీసుకువెళ్లడం, బ్యాడ్ గా బిహేవ్ చేయడం, డబ్బులు ఎక్కువగా అడగటం చేశాడు.అతడు చేసిన తప్పుకి భారతీయులుగా మేము క్షమాపణలు చెబుతున్నాం అని నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేశారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.