సూర్యకాంతం.( Suryakantham ) ఈ పేరు వినగానే చాలామందికి గయ్యాళి అత్త గుర్తుకు వస్తూ ఉంటుంది.
అప్పుడెప్పుడో పూర్వం బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల నుంచి ఇప్పటికీ ఈమె పేరు వినిపిస్తూనే ఉంది.తెరపై ఎన్నో సినిమాలలో గయ్యాళి అత్తగా కనిపించి గయ్యాలి అత్త క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని చెప్పవచ్చు.
అయితే ఆమె సినిమాలలో గయ్యాలి అత్త క్యారెక్టర్లలో నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఆమె మనసు వెన్న అని చెప్పాలి.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది సూర్యకాంతం.
మరి అలాంటి ఆమె గురించి తాజాగా ఆమె కొడుకు వైద్యుడు అనంతపద్మనాభ మూర్తి( Ananta Padmanabha Murthy ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె గురించి అనేక విషయాలు పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మా అమ్మ గయ్యాలి కాదు.అనురాగ దేవత. నా భార్యను సొంత కూతురిలా చూసుకునేది.పనిమనిషి ఉన్నప్పటికీ తనే వంట చేసి వడ్డించేది.
అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది.చదువుకునే సమయంలో చదువు, ఖాళీ సమయంలోనే ఆటలు అని చెప్పేది.
నాన్న అడ్వకేట్.అమ్మకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు.
సావిత్రి అంటే అమ్మకు చాలా ఇష్టం.తనకు చాలా సహాయం చేసింది.
అమ్మ చేతిలో దెబ్బలు తినని ఏకైక హీరోయిన్ జమునగారే! తనెప్పుడూ ఆమెకు కూతురిగానే నటించేది.
గొప్ప నటీమణులందరూ ఆమె చేతిలో దెబ్బలు తిన్నవారే.అమ్మ చనిపోయిన ఏడాది పిచ్చిపట్టినట్లయింది.తను డయాబెటిక్.
కిడ్నీ ఫెయిలవడం( Kidney Failure ) వల్లే చనిపోయింది.ఇంకా కొన్నాళ్లు బతికుండాల్సింది.
అమ్మకు నెయ్యి ఇష్టం.అలాగే ఫ్రై చేసిన పదార్థాలు అన్నా కూడా ఇష్టం.
ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించలేదు.డయాబెటిస్ రావడంతో డయాలసిస్ కూడా చేయించుకుంది.
అప్పుడు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో చేర్చారు.దాదాపు పన్నెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది చివరకు మరణించింది అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో ప్రేక్షకులు మరొకసారి సూర్యకాంతం ని గుర్తు చేసుకున్నారు.