టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) బయట ఎంత యాక్టివ్ గా ఉంటాడో.గ్రౌండ్ లో కూడా అంతకుమించి యాక్టివ్ గా ఉండడం చూస్తూనే ఉంటాము.
తన టీం మేట్స్ తో ఎంతో ఫన్నీగా ఉంటూనే మరోవైపు బాగానే హెచ్చరికలు కూడా చేస్తుంటాడు.చాలాసార్లు స్టెంప్స్ మైక్ లో ఫన్నీగా మాట్లాడిన మాటలు కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇకపోతే ఆదివారం నాడు శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకతో జరిగిన టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం ఇన్నింగ్స్ లో 33వ ఓవర్ వేయడానికి వచ్చిన వాషింగ్టన్ సుంద( Washington Sundar )ర్.తన తొలి బంతిని వేసే క్రమంలో కాస్త తడబడ్డాడు.ఈ సమయంలో అతను రెండు సార్లు ఇబ్బంది పడ్డాడు.
మొదటిసారి బంతిని వేసే సమయంలో వికెట్ల వద్దకు వచ్చి ఆగిపోయాడు.దాంతో స్లిప్పులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ నవ్వుకుంటూ ఉండడం వీడియోలో కనపడుతుంది.
అయితే మరోసారి బాల్ వేయడానికి వచ్చిన సందర్భంగా మళ్లీ అలాగే చేయడంతో.స్లిప్పులో ఉన్న రోహిత్ శర్మ నిన్ను కొట్టేస్తా అన్నట్లుగా.
పరిగెత్తుతూ వస్తు బాటర్ను దాటుకొని మరి ముందుకు వచ్చాడు.
దీంతో బౌలర్ వాషింగ్టన్ సుందర్ తో పాటు మిగిలిన జట్టు సభ్యులందరూ కూడా నవ్వుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఇకపోతే ఈ మ్యాచ్లో టీమిండియా 32 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది.
దీంతో సిరీస్ లో 1 – 0 శ్రీలంక ముందంజలో ఉంది.