కొన్ని సినిమాలు ఎంతో నవ్విస్తాయి, మరికొన్ని సినిమాలు బాగా ఏడిపిస్తాయి.వాటిలో ఎమోషన్స్ అంత బలంగా ఉంటాయి.
టాలీవుడ్( Tollywood ) లో వచ్చిన స్నేహం కోసం యోగి లాంటి హై ఎమోషనల్ డ్రామాలు చాలామందిని తెగ ఏడిపించే సాయి వీటిని ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూసినట్లుగానే మనం బోరున ఏడ్చేస్తాం.అలాంటి మూడు సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• యోగి
( Yogi )
యోగి సినిమా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కింది.ఇందులో తన తల్లి ఆచూకీ కోసం యోగి అన్నిచోట్ల వెతుకుతాడు.
తల్లి కూడా యోగి కోసం వెతుకుతుంది.కానీ ఇద్దరూ అసలు కలవరు.
యోగి తల్లి తన కొడుకుని కలుసుకోకుండానే చనిపోతుంది.ఆ విషయం తెలియకుండానే ఆమె పాడెను యోగి మోస్తాడు.
ఆమెను చివరి చూపు కూడా చూడలేడు.అంతక్రియలు జరిగిపోతున్నప్పుడు ఆ సంగతి తెలుస్తుంది.
అప్పుడు యోగి గుండెలవిసెలాగా ఏడ్చేస్తాడు.అదే సమయంలో తల్లి బతికున్నట్టు ఊహలు వస్తుంటాయి.
అప్పుడు ఆ ఊహల్లోనే ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తుంటాడు.ఆ సన్నివేశం చూస్తే ఎవరికైనా సరే కళ్ల వెంట నీళ్లు రాకుండా ఉండలేవు.
ఈ సన్నివేశంలో శారద, ప్రభాస్ చాలా బాగా నటించి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించారు.
• స్నేహం కోసం
( Sneham kosam )
నిజమైన స్నేహం ఎలా ఉంటుందో చెప్పే అద్భుతమైన మూవీ “స్నేహం కోసం”.ఇందులో చిరంజీవి, విజయకుమార్( Chiranjeevi, Vijayakumar ) క్లోజ్ ఫ్రెండ్స్ గా నటించారు.ఇందులో ప్రతి సీన్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
చిరంజీవి, విజయ్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు కండతడి పెట్టిస్తాయి.విజయకుమార్ అల్లుడు చేసిన నేరాన్ని తాను చేసినట్లు చిరంజీవి ఒప్పుకుంటాడు.
విజయకుమార్ కూతురు సౌభాగ్యవతిగా సంసారం చేసుకోవాలనే అతడు తన జీవితాన్ని త్యాగం చేస్తాడు.ఆ విషయం చివరికి తెలుస్తుంది.
ఆ సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి.కన్నీళ్లు అప్రయత్నంగానే తన్నుకొస్తాయి.
ముఖ్యంగా చిరంజీవి, విజయకుమార్ ఒకేసారి తుది శ్వాస విడిచినప్పుడు ఏడవకుండా ఉండలేము.ఈ సినిమా చూడాలనుకునేవారు నాలుగైదు టిష్యూ పేపర్లు ముందే రెడీ చేసుకుని ఉంచుకోవడం మంచిది.
• భీమిలి కబడ్డీ జట్టు
( Bhimili Kabaddi jattu )
ఈ సినిమా కబడ్డీ ఆట చుట్టూ తిరుగుతుంది.ఇందులో సూరి (హీరో నాని) చాలా కష్టపడి కబడ్డీ ఆటలో గెలుస్తాడు.ఆటలో గెలవడమే ఆ టీం ధ్యేయం.చివరికి గెలవడంతో టీమ్ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలా సంతోషిస్తారు.మనం గెలిచేశాం రా సూరి అని హ్యాపీ న్యూస్ చెప్పడానికి వారందరూ సూరి ఇంటికి వెళ్తారు.కానీ సూరి చచ్చిపోయాడు.
ఆ సీన్ అందరికీ షాక్‌కి ఇస్తుంది.సూరి చనిపోయినప్పుడు తల్లి, అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏడవడం చూస్తున్నప్పుడు మనకి కూడా ఏడుపు వచ్చేస్తుంది.