బ్యూటీ ని ఎలివేట్ చేయడంలో లిప్స్ అనేవి కీలక పాత్రను పోషిస్తాయి.అందుకే చాలామంది పింక్ అండ్ సాఫ్ట్ లిప్స్ ను( Pink And Soft Lips ) కోరుకుంటారు.
కానీ సీజన్ తో సంబంధం లేకుండా కొందరి పెదాలు తరచూ పొడి బారిపోతుంటాయి.పగుళ్లు ఏర్పడుతుంటాయి.
అటువంటి పెదాలకు చెక్ పెట్టి పింక్ అండ్ సాఫ్ట్ లిప్స్ ను పొందాలనుకునేవారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను తప్పకుండా ఫాలో అవ్వండి.
పెదాలు తేమగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మృత కణాలను తొలగించుకోవాలి.
అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె,( Honey ) వన్ టేబుల్ స్పూన్ షుగర్( Sugar ) వేసుకుని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
వారానికి కనీసం ఒక్కసారైనా ఇలా చేయాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడిలో రెండు టేబుల్ స్పూన్లు బాదం నూనె( Almond Oil ) కలిపి పెదాలకు పూతలా అప్లై చేసుకోవాలి.15 నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయాలి.ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి.
పెదాలు పొడిబారడం, పగుళ్లు సమస్య తగ్గు ముఖం పడుతుంది.అదే సమయంలో డార్క్ లిప్స్ సహజంగానే పింక్ షేడ్ లోకి మారతాయి.
రెండు రోజులకు ఒకసారి ఈ లిప్ మాస్క్ వేసుకోవాలి.
ఇక ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ మరియు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని పదినిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై పెదాలను సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల నలుపుదనం పోయి పెదాలు అందంగా కాంతివంతంగా మారుతాయి.