వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?

ఇటీవల కాలంలో ప్రాంకులు( Pranks ) చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి డబ్బు సంపాదించాలని యువత ప్రయత్నిస్తున్నారు.పాకిస్థాన్‌ దేశంలో( Pakistan ) అలాంటి ఒక ఫ్రాంక్ చేయడం జరిగింది.

 Phone Stealing Prank Gone Wrong In Pakistan Funny Video Viral Details, Viral Vid-TeluguStop.com

దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.ట్విట్టర్ పేజీ ‘Ghar Ke Kalesh’ ఈ వీడియోను పంచుకుంది.

ఈ పేజీలో చాలా ఫన్నీ వీడియోలు పెడతారు.

ఈ వీడియోలో మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు మరొక యువకుడి వద్దకు వెళ్తారు.

ఆ యువకుడు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు అదే సమయంలో, ఆ ఇద్దరు ప్రాంక్‌స్టర్స్‌ ఆ బాలుడి ఫోన్ తస్కరించి( Phone Stealing ) అక్కడ నుంచి పరారు కావాలని ప్రయత్నిస్తారు.కానీ అనుకోకుండా, వెనుక నుంచి మరో మనిషి వచ్చి, తుపాకితో( Gun ) ఆ ఇద్దరినీ బెదిరిస్తాడు.

అంటే, దొంగతనం చేయాలనుకున్న వాళ్ళే తుపాకికి భయపడి పారిపోవాల్సి వస్తుంది.

తుపాకీ చూసి భయపడిపోయిన ఆ ఇద్దరు ప్రాంక్‌స్టర్స్‌, అది ఒక జోక్ అని చెప్పేశారు.కానీ ఆశ్చర్యంగా, తుపాకీతో బెదిరించిన వ్యక్తి నవ్వేస్తాడు, అది నిజంగా జోక్ అని అర్థం చేసుకుంటాడు.తుపాకీ పట్టుకున్న ఈ వ్యక్తికి ఇది ప్రాంక్ అని ముందుగానే తెలిసినట్లు ఉంది.

అందుకే అతను వారిని భయపెట్టి ఆ తర్వాత బాగా నవ్వుకున్నాడు.వాళ్లు మాత్రం చాలా భయపడిపోయారు.

తమని క్షమించమంటూ, పైనే వీడియో తీసే వ్యక్తి కూడా ఉన్నాడంటూ చెప్పారు.

ఆ వీడియో చూసిన వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు, కొంతమంది నవ్వారు కూడా.కొంతమంది ఆ ఇద్దరు మనుషులను తిట్టారు.“ఇప్పుడు పాకిస్తాన్‌లో ఎందుకు పేదరికం ఉందో నాకు అర్థమైంది!” అని ఒకరు కామెంట్ చేశారు.అంటే, వాళ్లు పాకిస్తాన్ దేశంలోని పేదరికం గురించి వ్యాఖ్యానిస్తూ, ఆ ఇద్దరిని చిన్నచూపు చూశారు.

ఈ వీడియో చూసి అందరికీ ఒక విషయం అర్థమైంది.

అదేమిటంటే, సోషల్ మీడియాలో ఎలాంటి వింత వీడియోలు అయినా వచ్చేస్తాయి.ఒక చిన్న జోక్‌గా మొదలైన వీడియో చాలా పెద్ద విషయంగా మారిపోతుంది.

అంతేకాదు, అలాంటి వీడియోలు చాలా చర్చలకు దారితీస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube