పర్మినెంట్ బ్లాక్ హెయిర్ ను కోరుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు ( white hair )సమస్యను ఎదుర్కొంటున్నారు.అయితే 50, 60 ఏళ్లు వచ్చినా కూడా కొందరి జుట్టు మాత్రం నల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది.

 Follow This Remedy For Permanent Black Hair! Permanent Black Hair, Black Hair, H-TeluguStop.com

అటువంటి వారిని చూసినప్పుడు అసూయ కలగడం సర్వసాధారణం.కానీ మీరు కూడా పర్మినెంట్ బ్లాక్ హెయిర్ పొందవచ్చు.

అందుకు ఎటువంటి కృత్రిమ రంగులు అవసరం లేదు.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే ఏజ్ పెరిగినా కూడా మీ హెయిర్ సూపర్ బ్లాక్ అండ్ షైనీ గా మెరుస్తుంది.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు స్పూన్లు మెంతులు( fenugreek ), రెండు స్పూన్లు నువ్వులు( Sesame seeds ) వేసి పూర్తిగా నల్లగా మారేంత వరకు వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు రెబ్బలు కరివేపాకు ( curry leaves )వేసి కరకరలాడేలా వేయించాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న కరివేపాకు, మెంతులు, నువ్వులు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Healthy, Remedy-Telugu Health

తదనంతరం ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న మెంతులు, నువ్వులు, కరివేపాకు పొడిని వేసుకోవాలి.అలాగే అరకప్పు కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసి రెండు రోజులు పాటు పక్కన పెట్టాలి.రెండు రోజులు గడిచాక తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని స్పూన్ తో మరొకసారి కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి తల మసాజ్ చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Healthy, Remedy-Telugu Health

గంట తర్వాత మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.తెల్ల జుట్టు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.అలాగే ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ మీకు పర్మినెంట్ బ్లాక్ హెయిర్ ను అందించడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

హెయిర్ రూట్స్ ని సైతం స్ట్రాంగ్ గా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube