యూకే: కాఫీ షాప్స్‌లో కొత్త రూల్.. ఇకపై అవి యూజ్ చెయ్యలేరు..?

బ్రిటన్‌లోని కాఫీ కేఫ్‌లు( UK Cafes ) తాజాగా ఒక కొత్త రూల్ తీసుకొచ్చాయి.ఈ రూల్ ప్రకారం కస్టమర్లు కాఫీ కేఫ్‌ల్లో ఫుల్ ల్యాప్‌టాప్‌లు( Laptops ) వాడలేరు.

 Uk Cafes Introduce Laptop Policies To Stop Remote Workers Hogging Tables Details-TeluguStop.com

అన్నిటి కంటే ముందుగా రెండు బ్రిటన్ కాఫీ కేఫ్‌లు పీక్ టైమ్స్‌లో సీట్లను ఆక్రమించుకునే రిమోట్ వర్కర్స్‌పై( Remote Workers ) చర్యలు తీసుకుంటున్నాయి.న్యూబరీలోని మిల్క్ అండ్ బీన్, కావర్‌షామ్‌లోని ది కలెక్టివ్ ల్యాప్‌టాప్‌ల వాడకంపై నిబంధనలు విధించాయి.

Telugu Impact, Cafe Atmosphere, Laptops Cafe, Milk Bean Cafe, Peak Hours, Remote

మిల్క్ అండ్ బీన్( Milk And Bean ) వీక్‌డేస్‌లో ల్యాప్‌టాప్‌ల యూజ్‌ను ఒక గంటకు పరిమితి విధించింది.వీకెండ్స్‌లో ల్యాప్‌టాప్‌లను అనుమతించరు.ది కలెక్టివ్( The Collective ) కూడా వీకెండ్స్‌లో ల్యాప్‌టాప్‌లను నిషేధించింది.వీక్‌డేస్‌లో మధ్యాహ్నం 11:30 నుంచి 1:30 మధ్య మాత్రమే అనుమతిస్తుంది.రిమోట్ వర్కర్లు అధిక సమయం పాటు అధిక సీట్లను ఆక్రమిస్తున్నారని ఆ రెండు కేఫ్‌లు చెబుతున్నాయి.ఇది అమ్మకాలను తగ్గిస్తుంది.

టేబుల్ టర్నోవర్‌ను( Table Turnover ) నెమ్మదిస్తుంది.ల్యాప్‌టాప్‌ల వాడకాన్ని పరిమితం చేయడం ద్వారా, కేఫ్‌లు మరింత మంది వినియోగదారులకు స్పేస్ కల్పించాలని, వ్యాపారాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Telugu Impact, Cafe Atmosphere, Laptops Cafe, Milk Bean Cafe, Peak Hours, Remote

రిమోట్ వర్కింగ్, కేఫ్‌లను ఆఫీస్‌లుగా ఉపయోగించే వ్యక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ లిమిట్స్ తీసుకురావడం జరిగింది.ది కలెక్టివ్ మేనేజర్ ఆలెక్స్ మిడిల్టన్ మరియు మిల్క్ అండ్ బీన్ యజమాని క్రిస్ చాప్లిన్ ల్యాప్‌టాప్ వాడకాన్ని ఎందుకు పరిమితం చేస్తున్నారో వివరించారు.వారి ప్రకారం, ల్యాప్‌టాప్ యూజర్లు చాలా గంటల పాటు టేబుల్స్‌ను ఆక్రమిస్తారు, దీనివల్ల టర్నోవర్, అమ్మకాలు తగ్గుతాయి.ఇతర వ్యక్తులకు కూర్చోడానికి స్థలం దొరకదు, కేఫ్‌కు అంతగా లాభాలు రావు.

ల్యాప్‌టాప్ యూజర్లు ఇతర కస్టమర్ల కంటే తక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.ల్యాప్‌టాప్‌లు కేఫ్ వాతావరణాన్ని, “వైబ్”ను ప్రభావితం చేస్తాయి.

ఈ విధానాన్ని అమలు చేయడం అసౌకర్యం కలిగించవచ్చు, కానీ కస్టమర్లందరికీ మంచి వాతావరణం అందించడానికి ల్యాప్‌టాప్‌లపై లిమిట్ తీసుకురావడం అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube