అభ్యర్థులు రెడీ... ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ వెయిటింగ్

తెలంగాణలో ఉప ఎన్నికలు( Telangana By-Elections ) వస్తాయనే నమ్మకంతో ఉన్న బీఆర్ఎస్( BRS ) దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటోంది.ఉప ఎన్నికలు వస్తే ఎవరిని అభ్యర్థిగా నియమించాలి అనే విషయంలో ఒక క్లారిటీకి ఇప్పటికే వచ్చింది.

 Brs Waiting For Byelections In Telangana Details, Brs,brs Party, By-election, Co-TeluguStop.com

నెలరోజుల్లోగా పార్టీ ఫిరాయచిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో , ఖైరతాబాద్,  స్టేషన్ ఘన్ పూర్,  భద్రాచలం నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ఫిక్స్ అయిపోయింది .దీంతో ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్ల పైన దృష్టి సారించింది.హైకోర్టు తీర్పు మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది.దీంతో ఆయా నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Telugu Badrachalam, Brs, Buchhayya, Congress, Khairathabad, Mannegovardhan, Rega

ఈ మేరకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ కీలక నేతలతో బీఆర్ఎస్ అగ్ర నేతలు మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రావణ్ ను( Dasoju Sravan ) పోటీ చేయించే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.ఆయనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి,  మన్నే గోవర్ధన్ రెడ్డి పేర్లను సైతం పరిశీలిస్తున్నారట.

  స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం రాజయ్యను పోటీకి దింపుతామని ఇప్పటికే పార్టీ ప్రకటించింది.  భద్రాచలం నుంచి బోధ బోయిన బుచ్చయ్య పేరును పరిశీలిస్తున్నారట.

బుచ్చయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు( Rega Kantha Rao ) పేరును కూడా పరిశీలిస్తున్నట్లు  ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, 

Telugu Badrachalam, Brs, Buchhayya, Congress, Khairathabad, Mannegovardhan, Rega

అది అనేక కారణాలతో వాయిదా పడింది.ఈ నేపథ్యం లోనే హైకోర్టు తీర్పు తో పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.కాకపోతే కోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ కార్యాలయం పాటిస్తుందా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది .కోర్టు గడువు ముగిసిన తర్వాత పరిస్థితిలను అంచనా వేసి దానికనుగుణంగా పార్టీ మారాలా వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకునే ఆలోచనతో చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారట.ఇక బీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయనే ఆశతోనే ఉంది.

అందుకే ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంపైనే పూర్తిగా దృష్టిపెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube