గోపీచంద్‌కు( Gopichand ) టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది.జయం, నిజం, యజ్ఞం, వర్షం సినిమాల్లో అతడి యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
అంత మంచి నటుడతడు.మంచి సినీ బ్యాక్‌గ్రౌండ్ కూడా అతని సొంతం.
గోపీచంద్ చాలా మంచోడు అని చెబుతుంటారు.అంతేకాదు, ఈయన ఆరడుగుల అందగాడు.
సిక్స్ ప్యాక్ బాడీ కూడా ఉంది.కానీ గత కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు.
సినిమా కథలను, దర్శకులను ఎంచుకునే విషయంలో తప్పులు చేయడమే ఆయన సినిమాలు ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం.ఆయన ప్రతిసారీ ఫ్లాప్ అందుకుంటూ చివరికి కమ్ బ్యాక్ ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నాడు.
ఒకప్పుడు గోపీచంద్‌కు ప్రభాస్‌తో( Prabhas ) సమానమైన ఇమేజీ ఉంది.కానీ ఇప్పుడు కెరీర్ పరంగా ప్రభాస్ దరిదాపుల్లో కూడా లేకుండా పోయాడు గోపీచంద్.ఇద్దరూ మంచి దోస్తులు.ఒకరేమో వరుసగా పాన్ ఇండియా హిట్స్ అందుకుంటుంటే గోపీచంద్ మాత్రం వరుసగా ఫ్లాప్స్ మాత్రమే అందుకుంటున్నాడు.
నిజానికి గోపీచంద్ సినిమా వస్తుందంటే అది ఒక ఫ్లాప్ సినిమా అని దాన్ని చూడకుండానే ఆడియన్స్ అనేస్తున్నారు.అలా ఈ హీరో సినిమాలపై ఓ ముద్ర పడిపోయింది.
అయితే ఈ నటుడికి ఎన్ని ఫ్లాప్స్ ఎదురైనా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.అది సంతోషించదగిన విషయం అని చెప్పుకోవచ్చు.
కానీ ఈ అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకోవాలి.2017 నుంచి ఆయన తీసిన ఆక్సిజన్, పంతం, చాణక్య, సీటీమార్, ఆరడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్, రామబాణం బీమా సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి.అంటే దాదాపు 8 ఏళ్లలో ఆయన ఖాతాలో ఒక్కటంటే ఒక్క హిట్ పడలేదు.ఇటీవల కాలంలో ఈ హీరో చేసిన సినిమాలు చూస్తే అవన్నీ ఒకే ఫార్ములా కథలతో వచ్చినట్టుగా అర్థమవుతుంది.
ప్రతి గోపీచంద్ సినిమాలో సేమ్ ఫైట్లు, సేమ్ డాన్సులు కనిపిస్తున్నాయి.ఎప్పుడూ రొటీన్ సినిమాలు తీయడం తప్ప గోపీచంద్ సినిమాల్లో వైవిధ్యం కనిపించడం లేదు.ఈ రోజుల్లో నిఖిల్, సాయి ధరమ్ తేజ్, చివరికి కళ్యాణ్ రామ్ కూడా ఏదో ఒక ప్రయోగాత్మక సినిమా తీస్తూ పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ అందుకుంటున్నారు.ఏదో నటించామా, సినిమా ఫినిష్ చేశామా అనేది తప్ప గోపీచంద్ ఏమీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
నిన్న అంటే అక్టోబర్ 11న ఈ హీరో శ్రీనువైట్లతో ( Srinuwaitla )కలిసి తీసిన ఒక సినిమా రిలీజ్ అయింది.ఆ సినిమా పేరు విశ్వం( Vishavam ).దానికి దర్శకుడు శ్రీను వైట్ల.ఒకప్పుడు వెంకీ, అందరివాడు, ఢీ, రెడీ, దూకుడు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందాడు.
అయితే ఆ కాలంలో ఎవరో కథ, డైలాగు రచయిత ఆయన సినిమా విజయాలలో భాగమయ్యాడట.కానీ అతను దూరమయ్యాక శ్రీను వైట్ల జస్ట్, ఓ సాదాసీదా దర్శకుడిగా మిగిలిపోయాడు.
ఒక్క హిట్టూ అందుకోలేక సతమతమవుతున్నాడు.గోపీచంద్ ఫ్లాప్ హీరో అయితే, శ్రీను వైట్ల డబుల్ ఫ్లాప్ దర్శకుడు అని చెప్పవచ్చు.
ఇక ఇద్దరూ కలిస్తే ఇంకేముంది.? ఊహించని పెద్ద ఫ్లాప్ చవి చూడాల్సిందే.విశ్వం సినిమాలో అదే జరిగింది.ఈ కామెడీ యాక్షన్ సినిమా ఔట్ డేటెడ్ స్టోరీతో వచ్చింది.ఒక గోపీచంద్ ఎప్పట్లాగానే ఓ మామూలు క్యారెక్టర్‌లో కనిపించాడు.హీరోగా బిల్డప్పులు కొట్టాడు.
యాక్షన్ సినిమాలతో చిరాకెత్తించాడు.లవ్ స్టోరీ ఉన్నా అది చాలా రొటీన్.
థియేటర్లకు రప్పించేంతలా గోపీచంద్ సినిమాలో ఏదీ లేదు.శ్రీను వైట్ల రాసుకున్న కథలో ఎలాంటి కొత్తదనం లేదు.
ఓల్డ్ సినిమాల్లోని కథనే తీసుకొచ్చి ఇందులో పెట్టారు.ఇక క్లైమాక్స్ మరీ వరస్ట్ గా ఉంది.
కావ్య థాపర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.అక్కడక్కడా పృథ్వి, వెన్నెల కిషోర్( Prithvi, Vennela Kishore ) మంచి కామెడీ పండించి నవ్వించారు.అనే సినిమా స్టోరీయే చెత్తగా ఉంది.అసలు ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నా గోపీచంద్ అని థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడి కూడా తిట్టుకోకుండా ఉండలేరు.
టీవీలో వచ్చిన కూడా చూడలేనంత బోరింగ్గా ఈ సినిమా ఉందని చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.హీరోకి కావలసిన అన్ని క్వాలిటీస్ ఉండి గోపీచంద్ ఇలా కెరీర్‌ను నాశనం చేసుకోవడమే ఇప్పుడు అభిమానులకు మింగుడు పడటం లేదు.
వెయిట్ చేసేనా ఒక మంచి ప్రయోగాత్మక సినిమాతో వస్తే మళ్లీ అతను హిట్ కొట్టే ఛాన్స్ ఉంది కానీ గోపీచంద్ మారేలాగా కనిపించడం లేదు.ఎప్పుడు చూసినా ఫ్లాప్ డైరెక్టర్లను పట్టుకుని దేనికి పనికిరాని సినిమాలు తీస్తున్నాడు.