ఈ బాలీవుడ్ మూవీ 60 ఏళ్ల క్రితమే సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతానికి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తెరకెక్కుతున్నాయి.దీనికి ముందు ఒక రొటీన్ ఫార్ములా, సక్సెస్ ఫార్ములాలతో సినిమాలు వచ్చేవి.

 Bollywood Sensational Movie, Dilip Kumar, Prithviraj Kapoor, Madhubala, Bollywoo-TeluguStop.com

చిరంజీవి, బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ లాంటి వారి తరంలో అలాంటి రొటీన్ సినిమాలు వచ్చేవి కానీ వీరికి ముందు తరం హీరోలు చాలా వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలు చేసేవారు.వాటితో సూపర్ సక్సెస్‌లు అందుకునే వాళ్లు.

అవి భారీగా మనీ కూడా కలెక్ట్ చేసేవి.ఈ కాలంలో భారీ సెట్లు, భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన లొకేషన్లు భారీ బడ్జెట్ సినిమాల్లో బాగా కనిపిస్తున్నాయి.ఇలాంటి ప్రొడక్షన్ క్వాలిటీస్‌ అప్పటి సినిమాల్లో లేవని కొంతమంది అనుకుంటారు కానీ అది నిజం కాదు.1960లోనే ఓ బాలీవుడ్ సినిమా ( Bollywood movie )ఇప్పటి భారీ బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా రూపొందింది.ఇది ఎన్నో రికార్డులను తిరగరాసింది.ఆ హిందీ మూవీ పేరు “మొఘల్ ఇ ఆజం”.

1960లోనే ఓ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా చాలామందికి ఫేవరెట్ అయిపోయింది.నిజానికి అప్పుడు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు.అయినా సరే ఉన్నంత టెక్నాలజీతో ఆ సినిమా మేకర్స్ గొప్ప మ్యాజిక్ చేశారు.‘మొఘల్ ఇ ఆజం” ( Mughal e Azam )సినిమాలో దిలీప్ కుమార్, పృధ్విరాజ్ కపూర్, మధుబాల ( Dilip Kumar, Prithviraj Kapoor, Madhubala )కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా కోసం లాహోర్ సెట్ వేశారు.అప్పట్లో అదొక సంచలనం.

Telugu Pyarkiya, Bollywood, Dilip Kumar, Madhubala, Mughal Azam-Telugu Top Posts

ఆ సెట్ ఏర్పాటు చేయడానికి దాదాపు 65 ఏళ్ల కాలంలోనే అక్షరాలా కోటి రూపాయల వరకు ఖర్చు వచ్చింది.అంటే ఆ డబ్బుతో అప్పట్లో ఏకంగా నాలుగైదు సినిమాలు చేయొచ్చు.కానీ ఈ మూవీ టీమ్ మాత్రం జస్ట్ ఒక సెట్ కి మాత్రమే అంత డబ్బులు పెట్టింది.‘ప్యార్ కియా తో డర్నా క్యా’ సాంగ్( ‘Pyar Kiya To Darna Kya’ song ) ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికీ ఈ పాట వినే వాళ్ళు ఉన్నారు.ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఈ సినిమాలోనిదే కావడం విశేషం.షకీల్ బదాయుని ఈ పాటని రాశారు.అయితే పాట చక్కగా రావాలని ఆయన దాదాపు 105 సార్లు ఎడిట్ చేసాడట.

ఎప్పటికప్పుడు కొత్త వర్షన్స్ క్రియేట్ చేస్తూ చివరగా ఒక మంచి ఫైనల్ వెర్షన్ రాశాడు.దాన్ని అద్భుతంగా కంపోజ్ చేయించి, బాగా పాడించారు.

అందుకే అది ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ సాంగ్ అయిపోయింది.దీన్ని లతా మంగేష్కర్ అద్భుతంగా పాడారు.

అప్పట్లో ఇది ఒక ట్రెండ్‌ సెట్ చేసింది.

Telugu Pyarkiya, Bollywood, Dilip Kumar, Madhubala, Mughal Azam-Telugu Top Posts

ఈ సినిమాకు దర్శకుడు నౌషాద్.ఆయన కూడా దీన్ని ఒక మాస్టర్ పీస్ లాగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడ్డాడు.అయితే వీరందరూ చేసిన కృషికి మించిన ఫలితం దక్కింది.

ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది.కోటిన్నర పెట్టి తీస్తే ఈ సినిమాకి ఏకంగా 11 కోట్లు వచ్చాయి.

ఈ మూవీ ఒక కళాఖండం.అందులో సందేహం లేదు.

దీన్ని ఇంకా చూడకపోతే ఓసారి కచ్చితంగా చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube