జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) త్రివిక్రమ్( Trivikram ) కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత మూవీ( Aravindha Sametha ) విడుదలై ఆరేళ్లు అవుతోంది.2018 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన అరవింద సమేత విడుదల కాగా మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేలా అద్భుతమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా అరవింద సమేత కావడం గమనార్హం.ఈ సినిమా తర్వాత ఈ కాంబోలో మరో మూవీ రాలేదు.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన నెలన్నర తర్వాత అరవింద సమేత విడుదలైంది.ఆ సమయంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య( Balayya ) హాజరు కావడం జరిగింది.
అరవింద సమేత ఇంట్రడక్షన్ ఫైట్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.అజ్ఞాతవాసి మూవీ డిజాస్టర్ అయినప్పటికీ త్రివిక్రమ్ కేవలం 7 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది.
ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను ఎంతో ప్రోత్సహించారు.
మొదట జగపతిబాబు( Jagapathi Babu ) పాత్రను చంపకుండానే క్లైమాక్స్ ప్లాన్ చేసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని క్లైమాక్స్ ను మార్చేశారు.క్లైమాక్స్ మార్చడం ఈ సినిమాకు ప్లస్ అయింది.ఈ సినిమా కథ విషయంలో అప్పట్లో కొన్ని వివాదాలు తలెత్తాయి.
ఎన్టీఆర్ కెరీర్ లో శరవేగంగా షూట్ పూర్తి చేసుకున్న సినిమాలలో అరవింద సమేత ఒకటి కాగా ఈ సినిమా చాలా తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తైంది.
రామ్ లక్ష్మణ్ ఈ సినిమాకు ఫైట్ మాస్టర్లుగా పని చేయగా ఇంట్రడక్షన్ సన్నివేశాలను మండుటెండలో షూట్ చేశారు.అరవింద సమేత సినిమాలోని కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్ ఘటనలతో స్పూర్తి పొందిన సన్నివేశాలు కాగా ఈ సీన్లు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు.థమన్ కు పూర్వ వైభవం రావడానికి కారణమైన సినిమాలలో అరవింద సమేత ఒకటి కాగా ఈ సినిమాలోని కొన్ని పాటలకు ఆశించిన రెస్పాన్స్ రాలేదని థమన్ భావిస్తారు.