ఉదయం ఈ ఒక్కటి తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సన్నబడతారు.. డైట్ కూడా అక్కర్లేదు!

లావుగా ఉన్నామని బాధపడుతున్నారా.? బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? రోజు చెమటలు చెందేలా వర్కౌట్ చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను తీసుకుంటే డైట్ కూడా అక్కర్లేదు.ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే సన్నబడతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 If You Take This Drink In The Morning You Will Lose Weight! Weight Loss Drink, L-TeluguStop.com

ముందుగా రెండు నిమ్మ‌ పండ్లను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.అలాగే అర అంగుళం అల్లం ముక్కను పొట్టు తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని దంచి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, అల్లం ముక్కలు( Ginger ), హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న చియా సీడ్స్( Chia Seeds ) వేసి బాగా కలిపి సేవించడమే.రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరంలో క్యాలరీలు చాలా వేగంగా కరుగుతాయి.దాంతో సూపర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.

బెల్లీ ఫ్యాట్ దెబ్బకు మాయం అవుతుంది.కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.పైగా ఈ డ్రింక్ ను తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు ఉంటే పరార్ అవుతాయి.ఇమ్యూనిటీ సిస్టం సైతం బూస్ట్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube