ఈ రోజుల్లో దొంగలు ఏమాత్రం భయపడకుండా పట్టపగలే భారీ చోరీలకు పాల్పడుతున్నారు.ఈ దొంగతనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గాను మారుతున్నాయి.
వాటిని చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది.ఇలా పట్టపగలే దొంగలు దోపిడీలకు పాల్పడుతుంటే ఇక సేఫ్టీ ఎక్కడ ఉంటుంది అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
మన ఇండియాలో మాత్రమే కాదు డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఇలాంటి దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవల అమెరికా దేశంలోని చికాగో నగరంలో( Chicago, USA ), కొంతమంది దొంగలు రైలును దోచుకున్నారు.
అది కూడా పట్ట పగలు! శుక్రవారం రోజు, ఈ దొంగలు రైలును ఆపి, దానిలో ఉన్న వస్తువులను దొంగిలించారు.
ఈ రైలు యూనియన్ పసిఫిక్ రైల్వేకు( Union Pacific Railway ) చెందినది.దొంగలు రైలులోని బోగీలను తెరిచి, టీవీలు, ఎయిర్ ఫ్రైయర్లు వంటి విలువైన వస్తువులను దొంగిలించారు.వారు చాలా గంటలు ఈ పని చేశారు.
రైలును చాలా దెబ్బతీశారు.ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఈ దొంగతనం జరుగుతున్నప్పుడు చూసి చాలా భయపడ్డారు.
వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.పోలీసులు వచ్చేసరికి, కొంతమంది దొంగలు ఎయిర్ ఫ్రైయర్లు, టీవీలు లాంటివి దొంగిలించి, వాటిని కార్లలో వేసుకుంటున్నారు.
చుట్టుపక్కల వీధుల్లో వేసిన పెట్టెలు చూస్తే, ఎంత పెద్ద ఎత్తున దొంగతనం జరిగిందో అర్థమవుతుంది.
చికాగోలో లేక్ స్ట్రీట్, లావర్న్ అవెన్యూ వద్ద రైలు పట్టాల దగ్గర చాలా మంది దొంగలు ఉన్నారు.చుట్టూ పోలీసులు ఎంతమంది ఉన్నా, వాళ్ళు పట్టాల దగ్గరికి ఎక్కి రైలును దోచుకుంటూనే ఉన్నారు.ఈ పట్టాలను ఖాళీ చేయడానికి యూనియన్ పసిఫిక్ పోలీసులకు ఒక గంట సమయం పట్టింది.
యూనియన్ పసిఫిక్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, “రైళ్లను దొంగిలించడం వల్ల ప్రజలు, మా ఉద్యోగులు, స్థానిక పోలీసులకు ప్రమాదం ఏర్పడుతుంది” అని అన్నారు.