నేను గెలిస్తే.. అమెరికన్లను చంపిన వారికి మరణశిక్షే : డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలైన డెమొక్రాట్లు, రిపబ్లికన్లు హామీల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) కీలక ప్రకటన చేశారు.

 Donald Trump Calls For Death Penalty For Migrants Who Kill Americans Details, Do-TeluguStop.com

అమెరికన్లను చంపిన వలసదారులకు మరణశిక్ష( Death Penalty ) విధించేలా చట్టం తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కొలరాడోలోని ఆరోరాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు.

అయితే ట్రంప్‌ది తొలి నుంచి అమెరికా ఫస్ట్( America First ) నినాదమే.తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ సిద్ధాంతాన్ని కఠినంగా అమలు చేసి ఆయన విమర్శల పాలయ్యారు.2024 ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మరోసారి వలసదారులకు కష్టాలు తప్పవని డెమొక్రాట్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు.ఇలాంటి వేళ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Telugu America, Americans, Barack Obama, Penalty, Democrats, Donald Trump, Kamal

అమెరికాను ప్రమాదకర వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని.తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే వలసదారులపై( Migrants ) ఆపరేషన్ ప్రారంభిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు.వెనెజులా గ్యాంగ్ ట్రెన్ డె అరగువా ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని వారిని ఏరిపారేయడానికి చర్యలు తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.అరోరాతో పాటు వారు దాడి చేసి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను రక్షిస్తానన్నారు.

నవంబర్ 5 అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఆయన వ్యాఖ్యలపై డెమొక్రాట్లు స్పందించాల్సి ఉంది.

Telugu America, Americans, Barack Obama, Penalty, Democrats, Donald Trump, Kamal

కాగా.డెమొక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్( Kamala Harris ) తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా . ట్రంప్‌పై విమర్శలు చేశారు.ట్రంప్ స్వార్ధపరుడని.

అలాంటి వ్యక్తి తమకు మంచి చేస్తాడని కొందరు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై దృష్టి పెట్టేవారే అమెరికాకు నాయకత్వం వహించాలని బరాక్ ఒబామా పిలుపునిచ్చారు.

ఈసారి ఎన్నికల్లో కమలా హారిస్ – ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఆయన జోస్యం చెప్పారు.ప్రస్తుతం ఒబామా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube