ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ గతేడాది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణిస్తూ.
కెనడాలోని( Canada ) వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని మూసివేసింది.తర్వాత ప్రజల నుంచి ఒత్తిళ్లు, డిమాండ్ల మేరకు ఈ సెంటర్‌ను పునరుద్ధరించింది.
అయినప్పటికీ కెనడా వెనక్కి తగ్గకుండా ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది.ఇప్పటికే నలుగురు భారతీయ యువకులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలు చురుగ్గా కొనసాగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే కెనడాతో సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని భారత్( India ) శుక్రవారం స్పష్టం చేసింది.
దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ .భారత ప్రధాని నరేంద్ర మోడీని( PM Narendra Modi ) కలిశారు ట్రూడో.ప్రస్తుతం లావోస్( Laos ) పర్యటనలో ఉన్న ఇద్దరు నేతలు .ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించారని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది.కొన్ని అపరిష్కృత సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని ట్రూడో పేర్కొన్నట్లుగా సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.
తమ ఇద్దరి మధ్య జరిగిన చర్చ వివరాలను వెల్లడించలేనని.కానీ కెనడియన్ల భద్రతే మాకు ముఖ్యమని ట్రూడో చెప్పారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య, తర్వాతి పరిణామాల తర్వాత ఇరుదేశాల ప్రధానులు ఎదురుపడటం ఇది రెండోసారి.గతేడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన జీ20 సమావేశాల కోసం ట్రూడో న్యూఢిల్లీకి వచ్చారు.ఈ సందర్భంగా ఖలిస్తాన్ ఆందోళనలు, కెనడాలో జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలను ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు మోడీ.తీవ్రవాద అంశాలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని.భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.వేర్పాటువాదులు దౌత్య ప్రాంగణాలను దెబ్బ తీస్తున్నారని.
కెనడాలోని పౌర సమాజాన్ని, వారి ప్రార్ధనా స్థలాలను బెదిరిస్తున్నారని ట్రూడోతో మోడీ తీవ్ర స్వరంతో తెలియజేశారు.