సాధారణంగా కొందరి లిప్స్ ( Lips ) నల్లగా ఉంటాయి.ఆహారపు అలవాట్లు, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, కెమికల్స్ అధికంగా ఉండే లిప్ స్టిక్స్ ను వాడటం, శరీరంలో అధిక వేడి తదితర కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి.
డార్క్ లిప్స్( Dark Lips ) కలిగిన వారు ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు.ముఖ్యంగా మగువలు నల్లటి పెదాలను గులాబీ రంగులోకి మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే చింతే అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను ప్రతి రోజూ నైట్ పాటిస్తే కనుక మీ పెదాలు మీరు కోరుకున్నట్లే గులాబీ రంగులో మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా చిన్న బీట్ రూట్ ను( Beet Root ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు వేసుకోవాలి.
అలాగే కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించడానికి ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వేళ్ళతో కనీసం రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ ( Scrubbing ) చేసుకొని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే పెదాలపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.అలాగే పెదాల నలుపు వదిలిపోతుంది.కొద్ది రోజుల్లోనే మీ డార్క్ లిప్స్ గులాబీ రంగులో అందంగా మెరుస్తాయి.చాలా మంది డ్రై లిప్స్ తో బాధపడుతుంటారు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కూడా పైన చెప్పుకున్న చిట్కా అద్భుతగా సహాయపడుతుంది.కాబట్టి అందమైన కోమలమైన మెరిసే పెదాలను కోరుకునేవారు తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.