ఈ ఆయిల్‌తో రోజు మసాజ్ చేసుకుంటే పొట్ట కొవ్వు మాయం అవ్వాల్సిందే!

సాధార‌ణంగా కొంద‌రికి శ‌రీరం మొత్తం స‌న్న‌గానే ఉంటుంది.కానీ, పొట్ట మాత్రం లావుగా ఉంటుంది.

 Daily Massage With This Oil Will Melt Belly Fat , Massage, Oil, Belly Fat, Melti-TeluguStop.com

ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలను అధికంగా తీసుకోవ‌డం, గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌టం, మ‌ద్య‌పానం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, వ్యాయామాల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, ఒత్తిడి, మెనోపాజ్‌ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పొట్ట వ‌ద్ద కొవ్వు పేరుకుపోయి లావుగా మారుతుంది.దాంతో ఈ బాన పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఆ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే వ‌ర్రీ వ‌ద్దు.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్‌తో రోజు మ‌సాజ్ చేసుకుంటే పొట్టు కొవ్వు మాయం అవ్వ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పొట్ట కొవ్వును క‌రిగించే ఆ ఆయిల్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక చిన్న‌ క‌ప్పు ఆవ నూనె, అర క‌ప్పు కొబ్బ‌రి నూనె, రెండు టేబుల్ స్పూన్ల ఆముదం వేసి లైట్ గా హీట్ అవ్వ‌నివ్వాలి.ఆ త‌ర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ వాము, ఐదు క‌ర్పూరం బిల్ల‌లు వేసి చిన్న మంట‌పై ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.

ఇలా మ‌రిగించుకున్న ఆయిల్‌ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.కంప్లీట్‌గా కూల్ అయిన త‌ర్వాత‌.ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో ఆయిల్‌ను స‌ప‌రేట్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్‌ను ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం.

ఒక చిన్న గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు త‌యారు చేసుకున్న ఆయిల్ వేసి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు హీట్ చేయాలి.ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం ర‌సం మిక్స్ చేసి.

పొట్ట‌పై అప్లై చేసుకోవాలి.

Telugu Belly Fat, Fat Oil, Tips, Latest, Massage, Oil Massage-Telugu Health Tips

ఆపై రెండు చేతుల‌తో పొట్ట‌ను క‌నీసం ప‌ది నిమిషాలు అయినా సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు మ‌సాజ్ చేసుకున్న‌ప్పుడు వేడి ఉత్ప‌త్తి అవుతుంది.ఆ వేడికి పొట్ట వ‌ద్ద పేరుకుపోయిన కొవ్వు క్ర‌మంగా క‌రిగిపోతంది.

దాంతో మీ బాన పొట్ట నాజూగ్గా త‌యార‌వుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube