మన ప్రపంచంలో చాలా అద్భుతమైన ప్రకృతి అందాలు ఉన్నాయి.కొన్నిసార్లు, అనుకోకుండా లేదా కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్నప్పుడు ఈ అద్భుతాలు మనకు కనిపిస్తాయి.అలాంటి అద్భుతమైన గుహ ఒకటి తాజాగా బయట పడింది.1991లో, ప్రపంచంలోనే అతిపెద్ద గుహను ఒక మనిషి కనుగొన్నాడు.ఆ గుహ పేరు సాన్ డోంగ్( San Dong ).ఈ గుహ వియత్నాంలో ఉంది.
వియత్నాం దేశానికి చెందిన హో కాంగ్ “ఫాంగ్ నహా-కే బాంగ్”( Ho Kong “Fang Naha-ke Bong” ) జాతీయ ఉద్యానవనంలో అడవిలో తిరుగుతున్నప్పుడు అనుకోకుండా ఈ గుహను కనుగొన్నాడు.భయంకరమైన తుఫాను నుంచి తలదాచుకోవడానికి అతను ఆ ప్రాంతానికి వెళ్ళాడు.
అప్పుడే గుహ ప్రవేశ ద్వారం కనిపించింది.కానీ, ఆ సమయంలో అతను గుహ లోపల ఎక్కువ దూరం వెళ్ళలేదు.
దీంతో, గుహ ఎక్కడ ఉందో మర్చిపోయారు.
కొన్ని సంవత్సరాల తర్వాత, హో కాంగ్ తన ఆవిష్కరణ గురించి బ్రిటిష్ గుహ పరిశోధన సంస్థకు చెందిన హోవార్డ్, డెబ్ లింబర్ట్ ( Howard, Deb Limbert )అనే ఇద్దరు వ్యక్తులకు చెప్పాడు.సాన్ డోంగ్ గుహ గురించి హో కాంగ్ చెప్పిన విషయాలు ఆ పరిశోధకులను చాలా ఆశ్చర్యపరిచాయి.ఆయన ఆ గుహలో నదులు, ఆకుపచ్చని చెట్లు ఉన్నాయని చెప్పాడు.
2009 సంవత్సరంలో, హోవార్డ్ లింబర్ట్ నేతృత్వంలోని బ్రిటిష్-వియత్నాం గుహ అన్వేషణ బృందం ఆ గుహను పరిశోధించి, దాని కొలతలు తీశారు.వారు ఆ గుహ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ గుహ అని నిర్ధారించారు.ఆ గుహలో 38.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఖాళీ ఉంది.2013 సంవత్సరంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా సాన్ డోంగ్ గుహను ప్రపంచంలోనే అతిపెద్ద సహజ గుహగా గుర్తించింది.ఆ గుహ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే అది వైరల్గా మారింది.
ఆ వీడియోను @danielkordan అనే అకౌంట్ పోస్ట్ చేసింది.ఈ అకౌంట్ రన్ చేసే వ్యక్తి ఎప్పుడూ రహస్యమైన ప్రదేశాలకు వెళ్లి వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.