స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలో గ్లామర్ డాల్ గా ఈ బ్యూటీకి గుర్తింపు ఉంది.సలార్ సినిమాతో శృతి హాసన్ ఖాతాలో మరో సక్సెస్ చేరిందనే సంగతి తెలిసిందే.సలార్2 సినిమాలో ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.తాజాగా శృతి హాసన్( Shruti Haasan ) ఇండిగో సంస్థ గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇండిగో సంస్థ విమానం నాలుగు గంటలు ఆలస్యం కావడం గురించి శృతి స్పందిస్తూ నేను సాధారణంగా ఇలాంటి విషయాలలో సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తానని అన్నారు.అయితే ఈసారి ఇండిగో నన్ను చాలా ఇబ్బంది పెట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.నాలుగు గంటల పాటు ఎయిర్ పోర్ట్ లో నేను పడిగాపులు కాశానని శృతి హాసన్ కామెంట్లు చేశారు.
అయినప్పటికీ ఫ్లైట్ ఇంతవరకు బయలుదేరలేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఇలాంటి విషయాలలో స్పష్టత ఇవ్వాలని మరింత మెరుగైన విధానాలను అవలంబించాలని శృతి హాసన్ వెల్లడించారు.అయితే శృతి హాసన్ పోస్ట్ గురించి ఇండిగో సంస్థ నుంచి స్పష్టత వచ్చింది.శృతి హాసన్ గారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో పేర్కొంది.
విమానం ఆలస్యమైతే ఎంత ఇబ్బందో అర్థం చేసుకోగలమని ఇండిగో వెల్లడించడం గమనార్హం.ముంబైలో వాతావరణం అనుకూలించక విమానం ఆలస్యమైందని ఆ అంశాలు మా చేతుల్లో లేవని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నామని ఇండిగో పేర్కొంది.
కస్టమర్లకు ఇబ్బంది రాకుండా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇండిగో సంస్థ తెలిపింది.ఇండిగో సంస్థ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ రిప్లై ఇచ్చారు.
నెటిజన్లు సైతం శృతి హాసన్ కు సపోర్ట్ చేస్తూ పోస్టులు చేయడం గమనార్హం.శృతి హాసన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.