భూమిక విడాకుల విషయంలో నాగార్జున జోక్యం.. అసలు సంగతి తెలిసి మతిపోయింది..?

అందాల తార భూమిక చావ్లా( Bhumika Chawla ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగింది.ఖుషి, ఒక్కడు, వాసు, సింహాద్రి, సత్యభామ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది.చూసేందుకు అప్సరసలాగా కనిపించే ఇంతటి అందాన్ని తెలుగు తెరకు పరిచయం చేసింది మరెవరో కాదు టాలీవుడ్ మన్మధుడు నాగార్జునే.2000లో “యువకుడు” అనే రొమాంటిక్ సినిమాతో భూమిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాతోనే ఆమె సినిమాల్లోకి అరంగేట్రం చేసింది.దీనిని అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ప్రొడ్యూస్ చేశాడు.ఇందులో ఏఎన్నార్‌ పెద్ద మనవడు సుమంత్ హీరోగా నటించాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది.

 Facts About Bhumika Divorce , Bhumika Chawla, Nagarjuna, Bhumika Divorce , Sne-TeluguStop.com

విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

Telugu Bharat Thakur, Bhumika Chawla, Bhumika Divorce, Nagarjuna-Movie

ఈ సినిమా చేసిన ఒక సంవత్సరం తర్వాత నాగార్జునతో కలిసి “స్నేహమంటే ఇదేరా( Snehamante Idera )” సినిమాలో కనిపించింది భూమిక.ఈ సినిమా చేసేటప్పుడు భూమికతో నాగార్జునకి మంచి పరిచయం ఏర్పడింది.ఆ తర్వాత వీళ్లు కలిసి ఏ సినిమా చేయలేదు కానీ ఆ ఫ్రెండ్ షిప్ అనేది మాత్రం అలాగే ఉండిపోయింది.

భూమికకి మొదట్లో వచ్చినట్లు ఆ తర్వాత తెలుగులో పెద్ద హిట్స్ రాలేదు.ఆమె తమిళం, హిందీ, భోజ్‌పురి, మలయాళం, పంజాబీ, కన్నడ ఇలా వివిధ భాషల సినిమాల్లో నటిస్తూ వెళ్ళిపోయింది.

బిజీగా ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ తన చిరకాల ప్రియుడు, యోగా టీచర్ అయిన భరత్ ఠాకూర్‌ను 2007, అక్టోబర్ 21న పెళ్లి చేసుకుంది.ఈ దంపతులకు ఒక పండంటి మగ బిడ్డ జన్మించాడు.

Telugu Bharat Thakur, Bhumika Chawla, Bhumika Divorce, Nagarjuna-Movie

అయితే కొంతకాలానికి భూమిక, భరత్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని సౌత్ ఇండియా వైడ్ గా పుకార్లు షికారు చేశాయి.ఈ రూమర్స్ గురించి భూమిక గానీ, ఆమె భర్త గాని పెదవి విప్పలేదు.దీంతో వీరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారేమో అని నాగార్జున అనుకున్నాడు.ఈ విషయంలో ఎలాగైనా జోక్యం చేసుకొని వారిద్దరి విడాకులకు బ్రేక్ వేయాలని భావించాడు.అందుకే స్వయంగా అతనే భూమిక ఇంటికి వెళ్ళాడు.ఆమె భర్తతో పాటు ఆమెతో కూడా మాట్లాడాడు.“ఏంటి, విడాకులు తీసుకుంటున్నారా? ఎందుకు, ఏమైంది?” అని అడిగాడట.దాంతో భూమిక దంపతులు ఆశ్చర్యపోయారట.“మేం విడాకులు తీసుకోవడం లేదు.జస్ట్ రూమర్స్ వస్తున్నాయి.

వాటిపై స్పందిస్తే ఇంకా ఈ రూమర్స్ ఎక్కువ అవుతాయి.వాటంతటవే సద్దుమణుగుతాయని మేము సైలెంట్ గా ఉన్నాం” అని భూమిక చెప్పిందట.

అది విని నాగార్జునకి మతిపోయినంత పని అయిందట.తర్వాత అందరూ నవ్వుకోవడం జరిగింది.

నాగార్జున “మీరు ఎప్పుడు కూడా విడాకులు గురించి ఆలోచించొద్దు” అని చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube