ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ సీజన్‌లో చలి పులి తెగ చంపేస్తుంటుంది.
ఈ చలి కారణంగా రాత్రి వేళ ఇంట్లో నుంచి బయటకు రావడానికే జంకుతుంటారు.ఈ వింటర్ సీజన్‌లో శరీరంలోని వేడి తగ్గిపోయి.
చలికి వణికిపోతూ ఉంటారు.ఇక చలితో పాటుగా జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి.
అయితే చలిని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా శరీరంలో వేడి పుట్టించే ఆహారాన్ని తీసుకోవాలి.మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
ఉల్లిపాయ శరీరంలో ఉష్ణోగ్రతలు పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి.అలాగే ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ వంటి గుణాలు జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది.
కాబట్టి, ప్రతి రోజు ఉల్లిపాయ తగిన మోతాదులో తీసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడి కలుపుకుని ప్రతి రోజు సేవించాలి.
ఇలా చేయడం వల్ల కూడా శరీరంలో వేడి పుడుతుంది.

ఈ వింటర్ సీజన్‌లో సాయంత్రం వేళ రైస్‌కు బదులు చపాతీలు తీసుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటే, గోధుమ పిండితో తయారు చేసే చపాతీలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు పెంచి.చలిని తట్టుకునేందుకు సహాయపడుతుంది.
మెంతికూర, మునగాకు, తోటకూర వంటివి కూడా ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే, ఈ ఆకుకూరలు ఒంట్లో వేడిని పుట్టించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
అలాగే పసుపు ఆరోగ్యానికి ఎంత మంచి.ఎన్ని జబ్బులను దూరం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక చలి కాలంలో రెగ్యులర్‌గా పసుపు తీసుకుంటే.యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరంలో హీట్‌ను పుట్టిస్తుంది.
అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను కూడా రక్షిస్తుంది.ఇక వీటితో పాటుగా అల్లం, వెల్లుల్లి, గుడ్డు, పాలు, కాఫీ, టీ, పల్లీలు, బెల్లం వంటివి కూడా డైట్‌లో చేర్చుకుంటే.
ఒంట్లో వేడి పుడుతుంది.